ఆ జిల్లా కూటమిలో ఆధిపత్య పోరు..?

కూటమి నేతల మధ్య మనస్పర్ధలు ఏర్పడుతున్నాయా? ఆ జిల్లాలో జనసేన పాతుకుపోయేందుకు చేస్తున్న ప్రయత్నియాలతో తెలుగు తమ్ముళ్లు ఆందోళనలో పడ్డారా? మిత్రపక్షంలో కూడా ఆదిపత్య పోరు మొదలైందా? ఆ మంత్రి వ్యవహార శైలితో తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి కి గురవుతున్నారా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? తెలుగు తమ్ముళ్ల ఆవేదన ఏంటి ? లెట్స్ వాచ్ ఇన్ దిస్ ఆఫ్ ది రికార్డ్

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే మిత్రపక్షలలో విభేదాలు బగ్గుమంటున్నా యి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన టిడిపి మధ్య విభేదాలు రాజుకుంటుంటే.. ఇప్పుడు కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో కూడా మిత్రపక్షంలో ఆధిపత్య పోరు మొదలైందన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గానికి చెందిన జనసేన జిల్లా అధ్యక్షుడు మంత్రి కందుల దుర్గేష్ జనసేన పార్టీ బలోపేతానికి పావులు కదుపుతుండటంతో నియోజకవర్గంలో తమ పార్టీ మనుగడ కోల్పోతుందేమో అన్న భయం లో పడ్డారట తెలుగు తమ్ముళ్లు. ఇటీవల నిడదవోలు మున్సిపాలిటీని జనసేన పూర్తిగా కైవసం చేసుకుంది . దీంతో రాష్ట్రంలోనే మొదటి జనసేన ఖాతాలో పడ్డ మున్సిపాలిటీ కావడంతో ఇక్కడున్న తెలుగుదమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట.

నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం 28 కౌన్సిలర్ స్థానాలు ఉండగా దానిలో 27 స్థానాలు వైసిపి ఖాతాలో ఉన్నాయి. కేవలం ఒక్క స్థానానికి మాత్రమే టిడిపి పరిమితమైంది .ఇక జనసేన అయితే ఇక్కడ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. కూటమి ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకి కాకుండా…జనసేన నుంచి కందుల దుర్గేష్ కి సీటు ఇవ్వటం అక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం మంత్రి పదవి రావడంతో ముసలం మొదలైంది . ఇక్కడే టిడిపికి జనసేనకి మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తుంది. దీంతో ఒకానొక టైంలో అధిష్టానం కలుగజేసుకొని ఇద్దరు పెద్దతలలను పిలిచి సంధి కూడా కుదిరిచినట్లు గుసగుసలు వినిపించాయి. అయితే కందుల దుర్గేష్ గెలిచిన తర్వాత మంత్రి పదవి రావడంతో నియోజకవర్గ అభివృద్ధి తోపాటు జనసేన పార్టీ బలోపేతాన కూడా కృషి చేస్తున్నారంట. దీంతో అక్కడున్న తెలుగు తమ్ముళ్లు ఆందోళనలో పడ్డారట. అయితే తెలుగు తమ్ముళ్లు ఆందోళనకి కారణం వైసీపీలోని పెద్దతలలు జనసేనలో ఒక్కొక్కరిగా జాయిన్ అవ్వటమేనట.

నిడదవోలు మండల జడ్పిటిసి సభ్యుడు నిడదవోలు చైర్మన్, వైస్ చైర్మన్ ఇలా ఒకరని కాదు గుంపు గుర్తుగా వైసీపీ నుండి జనసేనలో చేరిపోయారు. వీరందరూ కలిసి మెజార్టీ సభ్యులతో అవిశ్వాస తీర్మానానికి.. జిల్లా కలెక్టర్ కు కూడా లేక సమర్పించారు. దీనంతటికీ బ్యాగ్రౌండ్ లో కందుల దుర్గేష్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే మొత్తం 28 కౌన్సిలర్లు ఉన్న నిడదవోలు మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ ను దాటి జనసేన పార్టీ జెండా ఎగరవేసింది. ఇక వైసీపీ నుంచి జనసేనలోకి కౌన్సిలర్లను జాయిన్ చేసుకోవడంపై టిడిపి అసహనం వ్యక్తం చేస్తోందట.

నిన్న మొన్నటి వరకు నిడదవోలు మున్సిపాలిటీ కి వైస్ చైర్మన్ గా జనసేన తరపున రతీదేవి పోటీ చేస్తున్నట్లు ఎన్నో వార్తలు వచ్చాయి. జూన్ 2వ తేదీన వైస్ చైర్మన్ పదవికి ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలపడంతో..నిడదవోలు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. ఒకరికి ఒకరు నువ్వా నేను అంటూ పోటీ పడ్డ సందర్భంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ రాజకీయ సమరంలో మూడో వ్యక్తి తెరపైకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రాత్రికి రాత్రే రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. మొన్నటి వరకు వైసీపీ కౌన్సిలర్ గా ఉన్న షేక్ వజీరుద్దీన్ ఒక్కసారిగా వైసీపీ పార్టీకి షాక్ ఇచ్చి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకోవడం.. ఒక్కసారిగా వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైపోవడం జరిగిపోయింది. దీని వెనక రాష్ట్ర మంత్రి కందల దుర్గేష్ , చైర్మన్ భూపతి ఆదినారాయణ ల తెర వెనుక రాజకీయం స్పష్టమవుతోందంటూ టాక్ నడుస్తోంది. నిడదవోలు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవిని కూడా గిఫ్ట్ గా ఇచ్చామని అన్నారు. జనసేన వైస్ చైర్మన్ గా బీసీ కులానికి చెందిన మైనారిటీ సభ్యులైన షేక్ వజీర్ నియమించడం పట్ల సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. షేక్ వసీరుద్దీన్ వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడంతో జనసేన కార్యకర్తల్లో నాయకుల్లో నూతన ఉత్తేజం మొదలైంది.

ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తో ముఖ్య నాయకులు సమావేశమయ్యారట. తమకు జరుగుతున్న అన్యాయాన్ని మాజీ ఎమ్మెల్యేతో వెళ్లగక్కుకున్నారట . నిడదవోలు టిడిపి పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు రాజీనామా చేసి తమ నిరసనను కూడా వ్యక్తం చేశారు. అయితే నియోజకవర్గ ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు కూడా తనకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదని గతంలో అన్నా క్యాంటీన్ల ఆహ్వానం కూడా తనకు అందలేదని తన సన్నిహితులు దగ్గర ఆవేదన వెళ్లగెక్కుకున్నారట . నిన్న మొన్నటి వరకు వైసిపి కౌన్సిలర్లు టిడిపి నాయకులును బండ బూతులు తిట్టారని.. ఇప్పుడు వారిని జనసేన లో ఎలా జాయిన్ చేసుకుంటారు అంటూ కొంతమంది తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారట. కేడర్ కి న్యాయం చేయలేనప్పుడు మనకి పదవులు ఎందుకు అని కొంతమంది అయితే తీవ్ర అసహనంతో ఉన్నారట.

అయితే వైసిపి లో ఉన్న కౌన్సిలర్లు అందరూ జనసేనలో చేరడానికి కారణం ఉందట. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జిఎస్ నాయుడు కూడా జనసేనలో చేరుతున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. అందుకనే వీరందరూ జనసేన బాటపడుతున్నారని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు . అయితే అధికారంలో ఉన్నప్పుడే అందుబాటులో లేని మాజీ ఎమ్మెల్యే అధికారం కోల్పోయినంక తాను ఒక్కడే ఆ పార్టీలో ఏం చేస్తాడు… అందుకనే జనసేనలో జాయిన్ అవుతున్నారని కొంతమంది నాయకులు గుసగుసలాడుకుంటున్నారు . ఏదేమైనా నిడదవోలులో జనసేన బలోపేతం చేయడంపై కందుల దుర్గేష్ తనదైన శైలిలో పట్టు సాధించడంలో సక్సెస్ అయ్యారని టాక్. ఇటు బూరుగుపల్లి శేషారావు కూడా పార్టీ నుంచి అనుకున్న స్థాయిలో నామినేటెడ్ లో లేకపోవడంతో ఇక నిడదవోలు నియోజకవర్గంలో దుర్గేష్ స్పీడు కు సైకిల్ రోడ్డు ఎక్కటం కష్టమేనని కొందరు అనుకుంటున్నారు. మరి నిడదవోలు నియోజకవర్గంలో మిత్రపక్షలలో విభేదాలను పార్టీ అధిష్టానాలు కలుగజేసుకొని ఏం చేస్తాయో వేచి చూడాలి.