
విశాఖపట్నం: ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం నా ఫోన్,నా భర్త ఫోన్,నా దగ్గర వాళ్ళ ఫోన్ లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు. అనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తా.. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న… ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం. రేవంత్,చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలి. అనాడు జగన్,కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయింది. తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ ఫోన్ ట్యాపింగ్..!
APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి:
- నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గరి వాళ్ళ ఫోన్లు లు ట్యాప్ చేశారు
- ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అనేది ముమ్మాటికి పచ్చి నిజం
- ఆనాడు కేసీఆర్, జగన్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండేది
- ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేవాళ్ళు
- వీళ్ల సంబంధం ముందు రక్త సంబంధం చిన్నబోయింది
- ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్
- నా ఫోన్ ట్యాప్ అయినట్లు నాకు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి చెప్పారు
- వైవీ సుబ్బారెడ్డి ఆనాడే నిర్ధారించారు
- అప్పుడు వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చారు
- నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు చెప్పారు
- ట్యాప్ చేసిన ఒక ఆడియో నాకు స్వయంగా వినిపించారు
- ఇప్పుడు సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడా..అంటే అనుమానమే ?
- జగన్ తన సొంత మేనల్లుడు,మేన కోడలు అస్థి కాజేసే అంశంలో సుబ్బారెడ్డి తో అబద్ధాలు చెప్పించాడు
- ఇలాంటి పరిస్థితిలో వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడు అనుకోను
- ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తా
- ఏ విచారణను అయినా ఎదుర్కొంట
- బైబిల్ మీద ప్రమాణం చేసి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నేను చెప్పగలను
- ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిస్తే మీరు ఏం చేశారు అని నన్ను అడగొచ్చు
- ఇది అక్రమం,అనైతికం కదా అని నన్ను అడగొచ్చు
- స్వయంగా మీ ఇంట్లో మీరు వింటే ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడగొచ్చు
- అన్నాడు ఉన్న పరిస్థితులు వేరు
- అప్పుడు జగన్, కేసీఆర్ చేసినవి అరాచకాలు
- వీరి అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చిన్నది
- నేను జగన్ కి తోడబుట్టిన చెల్లెలు
- ఆ విషయం మరిచి నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదు అని కుట్ర
- నా భవిష్యత్ ను పాతిపెట్టాలని ఎన్నో చేశారు
- ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కుట్ర
- నాకు సపోర్ట్ చేసిన వాళ్లను బెదిరించారు
- రాజకీయంగా నా వాళ్ళు రానివ్వకుండా చేశారు
- నా అనుచరులను భయబ్రాంతులకు గురి చేశారు
- నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు
- నేను తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ కి ఏ సంబంధం లేదు
- కేసీఆర్ కోసం నన్ను తొక్కి పెట్టాలని చూశాడు
- నా చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశాడు
- నా సర్వైవల్ కోసం నేను పోరాటం చేశా
- నా ప్రతి పోరాటానికి అడ్డు పడ్డారు
- ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం
- ముమ్మాటికి నిజం
- అనాడు ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు లేవు
- ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు అధికారంలో ఉన్నారు..అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు
- ఫోన్ ట్యాపింగ్ మీద చర్యలు తీసుకోవాలి
- ఎక్కడకు పిలిస్తే అక్కడకు వస్తా
- నేను కేసు పెట్టాలి అనుకుంటే అప్పుడే పెట్టే దాన్ని
- నాకు పర్సనల్ గజ్ అంటూ ఏమి లేదు
- నా మీద జగన్ కేసు వేసినప్పుడే నేను కేసు వేసే దాన్ని
- అమ్మకు ఇచ్చిన ఆస్తి విషయంలో కేసు వేసినప్పుడే నేను కేసు వేసే దాన్ని
- రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలి.