
పశ్చిమగోదావరి జిల్లాలోని ఆ నియోజకవర్గ టిడిపి నేతలు డీలాపడ్డారా..? టిడిపి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాన్నీ అధిష్టానం గాలికి వదిలేస్తోందా..? కష్టకాలంలో పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చిన కూటమి పొత్తు ధర్మానికి సీట్లు త్యాగం చేశారు..? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తుంది. అయినా అధిష్టానం తమ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదని ఆ నేతలు అంటున్నారు. ఇంతకీ ఎవరు ఆ నేతలు… ఎక్కడ ఆ నియోజకవర్గం తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983 నుంచి వరుసగా ఏడుసార్లు నరసాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేశారు. హరి రామ జోగయ్య, కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి వారు ఈ నరసాపురం నియోజకవర్గం నుంచి గెలుపొంది కీలక మంత్రి పదవులు కూడా చేపట్టారు. సముద్ర తీర ప్రాంత నియోజకవర్గమైన నరసాపురం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటూనే ఉంది. టిడిపి కంచుకోట నరసాపురంలో 2009లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత 2014లో తిరిగి మళ్లీ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ప్రసాద్ రాజు పై బండారు మాధవ నాయుడు గెలుపొందారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం వైసీపీ విజయం సాధించింది. నియోజవర్గంలో బలమైన క్యాడర్ ఉన్న టిడిపి 2019 ఎన్నికల ఓటమి తర్వాత పూర్తిగా చతికిల పడింది. అప్పటివరకు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుని పక్కనపెట్టి పొత్తూరు రామరాజుకు నరసాపురం నియోజవర్గ టిడిపి బాధ్యతలు అప్పగించారు. మరో పక్క నియోజకవర్గంలో ఆర్థికంగా పార్టీని ఆదుకునేందుకు కొవ్వల నాయుడును అధినేత చంద్రబాబు నియమించారు.
2020 నుంచి 2024 ఎన్నికల వరకు.. నరసాపురం నియోజకవర్గంలో టిడిపి బలోపేతానికి ఆ ఇద్దరు నేతలు ఎంతగానో కృషి చేశారు..పార్టీ కేడర్ చెదిరిపోకుండా వైసిపి పార్టీని ఎదుర్కొని నిత్యం ప్రజల పక్షాన పోరాడుతూ అధికార ఎమ్మెల్యేపై ధ్వజమెత్తేవారు.. అటు ఆర్థికంగా కొవ్వల నాయుడు తన సహకారాన్ని నియోజకవర్గానికి అందించేవారు.. 2024 ఎన్నికల్లో సీటు ఆశించిన పొత్తూరు రామరాజు, కొవ్వలి నాయుడులకు టీడీపీ, జనసేన, బీజేపీ, పొత్తు లో ఎదురుదెబ్బ తగిలింది.. 2024 ఎన్నికల్లో సీట్లు సర్దుబాటులో నరసాపురం నియోజకవర్గాన్ని జనసేన కు కేటాయించారు.నరసాపురం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి గా పోటీ చేసిన బొమ్మిడి నాయగర్ విజయం సాధించారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం దగ్గర పడుతున్నా తెలుగుదేశం బలోపేతానికి, కూటమి పార్టీ విజయానికి కష్టపడి పని చేసిన తమ పరిస్థితి ఏమిటంటూ కొవ్వలి నాయుడు, రామరాజులు తమలో తామే మదన పడుతున్నారట.. కొవ్వలి రామ్మోహన్ నాయుడు ఎన్ఆర్ఐ కావడంతో పొత్తూరు రామరాజుకి టికెట్ వస్తుందని రామరాజు ఇక్కడ ఉండని కారణంగా అంతా అలా అనుకున్నారు . అయితే నర్సాపురం నియోజవర్గంలో టిడిపి అధిష్టానం నుంచి నేతలకు ఆశించిన స్థాయిలో పదవులు కేటాయించడంలో పూర్తిగా విఫలమైందని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదవులు వస్తాయని ఆశించిన నేతలకు మాత్రం అధిష్టానం తగిన గుర్తింపు ఇవ్వబడిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అనేక నామినేట్ పదవులను విడుదల చేసింది.అయితే ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పోస్టుల్లో ఒక్క పోస్ట్ కూడా దక్క లేదట . గతంలో విడుదల చేసిన కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని సైతం జనసేన నేత మాజీ మంత్రి సుబ్బారాయుడుకు ఇవ్వడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన నామినేట్ పోస్టులోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై నరసాపురం జిల్లా స్థాయి నేతలు పార్టీ తీసుకునే నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.. డీసీఎంఎస్ చైర్మన్ పదవిని జనసేన నేత చిన్న బాబుకి కేటాయించడం నరసాపురం టిడిపి నేతలను మరింత కుంగదీస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పొత్తు ధర్మం అంటూ తమ చేతులు నోరు కట్టేసారని అక్కడున్న నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లందరూ అభిప్రాయపడుతున్నారట.
నరసాపురం టిడిపి ఇన్చార్జిగా ఉన్న రామరాజు పూర్తిగా చతిగలపడిన పార్టీని పరుగులు పెట్టిస్తూ కార్యకర్తల చెక్కుచెదరకుండా కష్టనష్టాలు ఎదుర్కొని నియోజవర్గంలో పార్టీనీ నిలబడితే.. టిడిపి అధిష్టానం తన వైపు చూడకపోదా అని అనుకున్నారు. కానీ.. అలా జరగకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో బయటికి వెళ్లి మొహం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారట . అధిష్టానం తనను పట్టించుకోకపోవడంతో పార్టీని కూడా వీడే పరిస్థితిలో ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే నరసాపురం నియోజకవర్గంలో టిడిపి కంచుకోటగా ఉన్న దాఖలాలు ఇంకా కనపడవు అని కేడర్ అనుకుంటోందట.
నరసాపురం నియోజకవర్గాన్ని అధిష్టానం పట్టించుకుని అక్కడి నేతలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారట.. లేకపోతే ఇప్పటివరకు టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం కాస్త జనసేన ఖాతాలోకి వెళ్లిపోతుందని భవిష్యత్తులో టిడిపి నరసాపురంలో కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా నరసాపురం నియోజకవర్గం వైపు పార్టీ అధిష్టానం దృష్టి సారించాలని కోరుతున్నారట.
పొత్తు నేపథ్యంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి కూటమి విజయానికి ఆర్థికంగా కష్టపడి పని చేసిన తనను ఇప్పుడు పార్టీ పట్టించుకోవడం లేదంటూ సన్నిహితుల వద్ద కొవ్వల నాయుడు తమ బాధను వెళ్ళగకుతున్నారట.. విదేశాల్లో బిజినెస్ లు సైతం వదిలేసి నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేశానని తన సంగతి ఏంటి అంటూ రాష్ట్ర టిడిపి నేతలు వద్ద అసహనం వ్యక్తం చేస్తున్నారట. నరసాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని పార్టీ కష్టకాలం నుంచి పనిచేసిన రామరాజును, కొవ్వల నాయుడుని పార్టీ ఎందుకు గుర్తించడం లేదని కార్యకర్తల్లో టాక్ నడుస్తోందట.