బాలయ్య బర్త్ డే కి పవన్ సోషల్ పోస్ట్.!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆల్ ఇన్ వన్ ఎంటర్టైనర్ గా మాస్ ఇమేజ్ పొందిన అగ్రకథానాయకుడు… పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు ఈ రోజు. బాలయ్య బాబు ఇవాళ 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ మాస్‌ హీరోకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయన ఫొటోలు షేర్‌ చేస్తూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ విషెస్ తెలుపుతున్నారు.

శతాధిక చిత్రాల కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించి మెప్పు పొందిన కథనాయకుడాయన అని కొనియాడారు. ప్రజా జీవితంలో భాగంగా హిందూపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు అందించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు పవన్‌ కళ్యాణ్.