
ముందోచ్చిన చెవుల కంటే, వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే సామెత ను పదే పదే గుర్తుచేసుకుంటున్నారు ఆ పార్టీ నాయకులు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ నే నమ్ముకుని కష్టకాలంలో కూడా జెండా మార్చకుండా ఉన్నందుకు తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందంటున్నారు. నిన్న వచ్చిన నేతలకు అగ్రతాంబూలాలు ఇచ్చి అందలం ఎక్కిస్తున్నారని అక్రోశం వెళ్ళగక్కుతున్నారు. పాతోక రోత కొత్త ఒక వింత అంటూ వేదాంతం వల్లెవేస్తున్నారు.. ఇంతకీ ఇంతటి నైరాశ్యం లో ఉన్న ఆ నేతలు ఎవరు? ఏ పార్టీ జెండా మోసి అసంతృప్తి కి లోనయ్యారు తెలుసుకోవాలంటే వాచ్ థిస్ ఆఫ్ ది రికార్డ్.
ఉమ్మడి తూర్పుగోదావరి Tdp లో అలకలు, అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. నామినేటడ్ పోస్టుల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పార్టీ అధికారం లోకి వస్తే తమకు జిల్లా స్థాయిలో నామినేటడ్ పోస్టులో బెర్త్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుందన్న ఆశలపై జనసేన రూపంలో నీళ్లు జల్లారని తమ సహచరుల వద్ద వాపోతున్నారట. పదవుల పందేరంలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని అసంతృప్తి తో రగిలిపోతున్నారట. పార్టీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణతో పని చేస్తున్నా, తమకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని, ప్రాధాన్యత లేని పదవులిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని మండిపడుతున్నారట. కార్యకర్తలే తమ పార్టీకి బలం,బలగమని గొప్పలు చెప్పే టీడీపీలో పదవులు మాట వచ్చేసరికి మోకాలడ్డుతున్నారని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులు ఇచ్చిన రోజులు గుర్తు తెచ్చుకుని, ఇప్పుడు కేవలం జిల్లా స్థాయిలో కూడా సరైన ప్రాధాన్యత లేని పదవులిచ్చి అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకారబ్యాంక్ ఛైర్మెన్ పదవిని మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్తిబాబు మొదట నుంచి ఆశించి చివరకు భంగపాటుకు గురయ్యారు. కూటమి పొత్తులో కాకినాడ రూరల్ సీటుని త్యాగం చేసి, జనసేన గెలుపు కోసం పనిచెయ్యడం తాము చేసిన తప్పా అని సత్తిబాబు వర్గం ప్రశ్నిస్తోందట. Dccb తమకు రాకుండా జనసేన నేతలు అడ్డుపడ్డారని ప్రచారం తెరపైకి తీసుకువస్తున్నారు. మాజీ mla దంపతుల్లో ఎవరికో ఒకరికి dccb దక్కినా.. రూరల్ నియోజకవర్గంలో జనసేన mla పంతం నానాజీకి పోటీగా నిలుస్తారనే ఉద్దేశం తో మోకాలడ్డారని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. తమకు జరిగిన అన్యాయం పై అధిష్టానం వద్ద తేల్చుకుంటామని సత్తిబాబు వర్గం అంటోందని టాక్.. ఇదే పదవికి కోనసీమ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యన్ని కూడా పక్కన పెట్టడాన్ని ఆ వర్గం ప్రశ్నిస్తోంది…ఒకవేళ పొత్తులో భాగంగా జనసేనకు dccb కేటాయించాలనుకుంటే, ఇప్పటికే నామినేటడ్ పదవి పొందిన తుమ్మల బాబు కే మళ్ళీ కట్టబెట్టడమెంటని ప్రశ్నిస్తున్నారు.
జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుకి గతంలో కాకినాడ అర్బన్ డవలేప్మెంట్ ఆధారిటీ ఛైర్మెన్ పదవి కట్టబెట్టారు. ఈ పదవి దక్కి
ఆరునెలలు కూడా గడవకుండానే, ఇప్పుడు ఆయనకి dccb ఛైర్మెన్ పదవి కూడా ఇవ్వడం లో ఉద్దేశ్యం ఏమిటని tdp ఆశావహులతో పాటు జనసేన నేతలు తెగ చర్చించుకుంటున్నారట. Dccb ఛైర్మెన్ గా అర్హత కలిగిన నేతలు జనసేనలో లేరా అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారట.
నామినేటడ్ పదవుల్లో మాజీ మంత్రి దివంగత నేత మెట్ల సత్యనారాయణ తనయుడు రమణ బాబు కి మొండి చెయ్యి చూపారని మెట్ల వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోందట. అప్కాబ్ ఛైర్మెన్ పదవి కోసం అయన మొదటి నుంచి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారని , సీఎం చంద్రబాబు,మంత్ర లోకేష్ ఇలా ముఖ్యనేతలందరిని కలిసినా ఫలితం దక్కలేదని పెదవి విరుస్తున్నారట. కూటమి పార్టీ ల అధినేతలు పదవులు పంచుతూ, పార్టీల నేతలకు న్యాయం చేస్తామని చెబుతున్నా కింది స్థాయిలో మాత్రం కూటమి నేతల మధ్య పచ్చ గడ్డి వెయ్యకుండానే బగ్గుమంటోంది. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకునే స్థాయి దాటి కత్తులు దూసుకుంటున్నారట.. మీ వల్లె అంటే మీ వల్లె తమ వాళ్లకు అన్యాయం జరిగిందని ఆక్రోసం వెల్లగక్కుతున్నారట. దీంతో కూటమి పార్టీల్లో నామినేటడ్ పోస్టులు రచ్చ రేపుతున్నాయి..ఈ రచ్చ ఏవిధమైన పరిణామలకు దారితీస్తుందో వేచి చూడాలి.