విడదల రజనీ..వివాదాల రజనీ అందుకే అయ్యారా?

ఆ మాజీ మంత్రి రూటే సపరేటు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్సు. ఉనికి కాపాడుకోవటం కోసం నిత్యం వివాదాలు కొని తెచ్చుకుంటారు. అధిష్టానం వద్ద మార్కుల కోసం విమర్శల పాలవుతారు. ఎన్ని చేసినా కేడర్ లో జోష్ రావటం లేదు. ప్రజల్లో పరపతి పెరగటం లేదు. దీంతో, కొత్త రూటు ఎంచుకొన్నారు. నియోజకవర్గంలో కాదు.. ఏకంగా రాష్ట్ర స్థాయి పదవి పైన గురి పెట్టారు. అంతే.. లెక్క మారి పోయింది. ప్రత్యర్థి పార్టీల పై విమర్శలు.. తమ అధినేత పై ప్రశంసలతో వచ్చే ఎన్నికల కోసం సిద్దం అవుతున్నారు. ఎంత చేసినా మైలేజ్ పెరగక సతమతం అవుతున్నారు. ఇంతకీ ఇంతలా వివాదాల్లో ఉన్న ఆ మాజీ మంత్రి ఎవరు..? ఏంటా కథ….లెట్స్ వాచ్ ఆఫ్ ది రికార్డ్

విడదల రజనీ. వివాదాల రజనీ అని పిలుచుకోవాలేమో. టీడీపీతో రాజకీయాలు ప్రారంభించి.. ఆ పార్టీనే ధిక్కరించి వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. అంతటితో ఆగలేదు. ఎమ్మెల్యే అయిన రెండున్నారేళ్లకే మంత్రి అయ్యారు. చిలకలూరిపేట లో ప్రత్తిపాటి పుల్లారావును 2019 ఎన్నికల్లో ఓడించిన రజనీ.. ఆ తరువాత నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నించారు. అధికారం అండ తో చెలరేగి పోయారు. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏ ఒక్క కేసు నమోదు కాలేదు. అధికారం పోయిన వెంటనే వరుస ఫిర్యాదులతో కేసులు నమోదు అయ్యాయి. కుటుంబ సభ్యులు రజనీ కారణంగా ఇబ్బందులు పడ్డారు. మంత్రి పదవి పోయినా రజనీ దూకుడు తగ్గలేదు. ఇప్పుడు కొత్త లక్ష్యంతో పని చేస్తున్నారు…

2024 ఎన్నికల్లో రజనీకి చిలకలూరిపేట కాదని.. గుంటూరు పశ్చిమం నుంచి సీటు కేటాయింపు జరిగింది. అక్కడ రజనీ ఓడిపోయారు. తిరిగి ఇప్పుడు చిలకలూరిపేట బాధ్యతలు అప్పగించారు. అక్కడ గత అనుభవాలతో ప్రత్తిపాటి పుల్లారావు అలర్ట్ అయ్యారు. రజనీకి మరో సారి ఛాన్స్ ఇవ్వకుండా గత పొరపాట్లు రిపీట్ కాకుండా అడుగులు వేస్తున్నారు. రజనీ ఇందుకు భిన్నంగా పట్టు పెంచుకునేందుకు వివాదాలనే ఆయుధంగా మలచుకున్నారు. వరుసగా టీడీపీ నేతలను, పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ లో హాట్ టాపిక్ మారారు. తన ఉనికిని కాపాడుకోవడానికి అధిష్టానం దృష్టిలో పడడానికి నిత్యం వివాదాల్లో ఉంటున్నారు….

రజనీ తన చర్యలతో అధిష్టానం దృష్టిలో పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విడుదల రజనీ ఇప్పుడు వైసిపి లోరాష్ట్ర పదవి అశిస్తున్నారని టాక్. అధికారంలో ఉన్నపుడు జగన్ మన్నలను పోందాడానికి అనాడు పాకులాడిన నేతలంతా ఇప్పుడు సైలైంట్ అయ్యారు. అయితే, రజనీ మాత్రం తన రూటులో తాను వెళ్తున్నారు. అధికారంలో ఉన్న లేకున్నా ఒకేలా రజనీ వ్యవహార శైలి ఉందనే వాదన వినిపిస్తోంది. ఎంత చేసినా పార్టీ కేడర్ నుంచి మద్దతు లభించటం లేదు. రజనీ గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో వైసీపీ నాయకత్వం కనిపించట్లేదు. పార్టీలో అందరనీ కలుపుకొని పోవటంలో రజనీ విఫలమవుతున్నారు. ఇలాంటి రజనీకి పార్టీలో కీలక పదవి ఎలా ఇస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రజనీ తన వ్యవహార శైలి మార్చుకుంటేనే భవిష్యత్ అని ఆమె మద్దతుదారులే చెబుతున్నారు. మరి.. రజనీ మారుతారా? వైసీపీ నాయకత్వమే రజనీనీ మార్చేస్తారా? వెయిట్ చేసి చూడాల్సిందే.