
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయి జైల్లో మగ్గుతున్నారు.. వరుసగా నమోదవుతున్న కేసుల్లో ఆయనకి బెయిల్ మంజూరవుతున్నా.. ఇంకా కేసులు పెండింగులో ఉండటంతో ఆయన జైల్లోనే గడపాల్సి వస్తోంది. వల్లభనేని వంశీ బెజవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కేసుల విచారణకు కోర్టుకి హాజరవుతున్న ఆయన్ని చూసి అందరూ నివ్వెరపోతున్నారు. జగన్‌తో అందగాడని పొడిగించుకున్న ఆ మాజీ ఎమ్మెల్యే అవతారం చూస్తూ.. చేసుకున్నోడికి చేసుకున్నంత అనే డైలాగ్ పొలిటికల్ సర్కిల్స్‌లో, సామాన్యుల్లో రీసౌండ్ ఇస్తోందంట ఇప్పుడు
జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. అడ్డగోలు దోపిడీలు, కబ్జాలకు పాల్పడ్డారు. ఎదురు తిరిగిన వారితో దారుణంగా ప్రవర్తించారు. పోలీసు స్టేషన్లకు వెళ్లాలంటేనే భయపడేలా చేశారు. తమపై కేసు పెట్టిన వారికి నరకం చూపించారు. వైసీపీ పాలించిన ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఇవే సీన్లు రిపీట్ అయ్యాయన్న ప్రచారం జరిగింది. తప్పును ప్రశ్నించిన బాధితులను అధికారం అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేశారు. చాలా చోట్ల పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి… కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకన్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు బయటకు వస్తున్నారు.
ఆ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయ్యారు. వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ టికెట్‌తో రెండు సార్లు గెలిచినప్పటికీ, జగన్ పంచకు చేరి ఫక్తు వైసీపీ నేతలా చెలరేగిపోయారు .. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి అతను కేసు ఉపసంహరించుకునేలా హింస పెట్టిన కేసులో వంశీ పోలీసులకు చిక్కారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13న వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. విజయవాడ కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు అయింది. మొత్తం వంశీపై 6 కేసులు నమోదు కాగా, 5 కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన కేసులో వంశీకి ఇంకా బెయిల్ రావాల్సి ఉండటంతో ఆయన ఇంకా జైల్లోనే మగ్గాల్సి వస్తోంది. వరుసగా నమోదవుతున్న కేసులు, బెయిల్ పిటీషన్ల విచారణ కోసం పోలీసులు కోర్టులకు తిప్పుతున్న వంశీని చూస్తూ అందరూ నివ్వెరపోతున్నారు.
ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిందే .. ప్రస్తుతం ఏపీలో అన్ని రాజకీయపార్టీల నేతలు, గన్నవరం వాసులు ఇదే అంటుకుంటున్నారంట .. జైల్లో పూర్తిగా మారిపోయిన వల్లభనేని వంశీ ఆకారం, దెబ్బతిన్న అతని ఆరోగ్యం చూస్తూ .. గతంలోనూ, ఇప్పటికీ ఆయనలో వచ్చిన మార్పుపై చర్చించుకుంటున్నారంట. వైసీపీ పంచన చేరాక ఇష్టమొచ్చినట్టు మాట్లాడి.. ప్రభుత్వం మారిన తర్వాత మూల్యం చెల్లించుకుంటున్నారని చెప్పుకుంటున్నారంట.
మాట జారేప్పుడు అహంకారంతో వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇది కేవలం టీడీపీలో మాత్రమే కాదు..అటు వైసీపీలోనూ ఇటు జనసేన, బీజేపీలోనూ అదే డిస్కషన్ నడుస్తోందంట…ఎలా ఉండే వంశీ ఎలా అయిపోయాడు అనుకుంటున్నారంతా… నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు, లోకేశ్ పై చేసిన కామెంట్స్‌ని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటున్నారు.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, సినిమా ప్రొడ్యూసర్ గా ఒక వెలుగు వెలిగిన వంశీ అవతారం జైల్లో ఆరోగ్యం క్షీణించి పూర్తిగా మారిపోయింది
ఫిబ్రవరిలో వంశీని జైల్లో పరామర్శించిన మాజీ సీఎం జగన్ తన పార్టీ నేతల గ్లామర్ గురించి మాట్లాడుతూ అందగాళ్లని కితాబిచ్చారు. చంద్రబాబు, లోకేశ్ కంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాశ్ లు అందంగా ఉంటారట. తమ సామాజికవర్గానికి వారి రాజకీయ ఎదుగుదలని చూసి ఓర్వలేకే చంద్రబాబు వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారంట … అందులో భాగంగానే కక్షపూరితంగా వల్లభనేని వంశీపై అక్రమ కేసులు పెట్టారట.. కొడాలి నాని, అవినాశ్ కూడా గ్లామర్‌గా ఉండటంతో వారిపైనా త్వరలోనే కేసుల్లో ఇరికిస్తారని జగన్ జోస్యం చెప్పేశారు..
వంశీ అందగాడు అంటూ జగన్ చేత పొగిడించుకున్న వంశీ గెటప్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కనీసం గుర్తు పట్టలేని స్థితిలో ఇరవై కేజీల బరువు తగ్గిపోయి.. శేషు సినిమాలో రాజశేఖర్ పాత్రను తలపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది .. అనారోగ్యంతో తీవ్రంగా దగ్గుతున్న వంశీని చూసి చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తున్నారని ఆయన బాధితులు అంటున్నారంట.
అరెస్ట్ అయినపుడు ఇన్నిరోజులు జైల్లో ఉండాల్సి వస్తుందని బహుశా వంశీ కూడా అనుకుని ఉండరు.. బెయిల్ వచ్చేస్తుందని అనుకున్నారు ఆయన కుటుంబసభ్యులు. కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ మిగిలిన కేసులు ఉండడంతో 3 నెలలు గడుస్తున్నా ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తోంది.అలావాటు లేని జైలు జీవితంతో బక్క చిక్కిపోయిన వంశీని చూసి సొంత సామాజికవర్గంలో సైతం చర్చ మొదలైందట.. ఇప్పటికైనా వంశీలో మార్పు వస్తే మంచిదేగా అనుకునుకుంటున్నారంట. మరి పేషంట్ అయిపోయిన వంశీ బెయిల్‌పై బయటకొచ్చాక ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి