
Jagan Finger Ring Controversy: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ చాలా సింపుల్‌గా కనిపిస్తారు. ఎక్కడికి వెళ్లినా సింపుల్ గా వెళ్తారు. చేతికి వాచ్ తప్ప పెద్దగా ఏ జువెలరీ వేసుకోరు. అయితే తాజాగా వైసీపీ అధినేత జగన్ ఎడమ చేతి వేలికి ఓ రింగ్ కినిపించింది. వైఎస్ జగన్ చేతికి కొత్త రింగ్ ఉన్నట్లు వీడియో నెట్టింట్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగైదేళ్లుగా ఈ హెల్త్ ట్రాకింగ్ రింగ్‌ను తన వేలికి పెట్టుకుంటున్నారు.ఆ రింగ్‌లో ఉండే చిప్ బీపీ, గుండె వేగంతో పాటుగా.. ఎంత రెస్ట్ అవసరమో కూడా తెలుపుతుందని గతంలో సీఎం తెలిపారు.
చంద్రబాబు దగ్గర ఉన్నట్లే జగన్ వేలికి కూడా ఇప్పుడు అలాంటి రింగ్ కనిపించడంతో ఆ రింగ్ హాట్ టాపిక్ అయ్యింది. జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో జగన్ చేతికి ఒక రింగ్ కనిపించింది.. Jagan Finger Ring Controversy ఆయన ఎడమ చేతి మధ్య వేలికి హెల్త్ ట్రాకింగ్ కోసం ఈ ఉంగరం పెట్టుకున్నట్లు చెబుతున్నారు. దీంతో హెల్త్ విషయంలో సీఎం చంద్రబాబును మాజీ సీఎం జగన్ పాలో అవుతున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.