ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు.. జనసేనాని ట్వీట్..!!

2024 జూన్ 4న ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి ఏడాది పూర్తయింది. కూటమి ఏకంగా 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. కూటమి విజయానికి ఏడాది పూర్తైన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్‌ చేశారు.

ప్రజా తీర్పునకు ఏడాది.. ప్రజా చైతన్యానికి ఏడాది..ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది..NDA కూటమి చారిత్రక విజయానికి ఏడాది..జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది.. ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజు అంటూ పవన్ పోస్ట్ పెట్టారు.

ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును బాధ్యతగా తీసుకున్నామని, గత తప్పిదాలను సరిచేస్తూ, భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా, రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర 2047 దిశగా నడిపించేలా.. కూటమి ప్రభుత్వం మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తుందన్నారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలకు పవన్ ధన్యవాదాలు తెలియజేశారు.