పల్నాడులో రక్త చరిత్ర మళ్లీ మొదలైందా..?

పల్నాడులో పరిస్థితులు మారుతున్నాయా? హత్యలు.. కక్ష్యలు మళ్లీ తారా స్థాయికి చేరాయా? ఒకనొక సమయంలో ఫ్యాక్షన్ గడ్డగా పేరున్న పల్నాడులో కాస్త మార్పు కనిపించినా…మళ్లీ ఇప్పుడు తిరిగి రక్త చరిత్ర మొదలైందా? రాజకీయ విభేదాలు హత్యలకు దారి తీస్తున్నాయా? పార్టీల ముఖ్య నేతలు బాగానే ఉంటున్నా….అమాయక కార్యకర్తల ప్రాణాలు బలవుతున్నాయా? పల్నాడులో మళ్లీ రక్తపాతం ఎందుకు మొదలైంది? కారకులు ఎవరు? ఇన్ సైడ్ ఏం జరుగుతోంది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

పల్నాడులో రాజకీయ హత్యలు పెరుగుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రయ్య హత్య సంచలనంగా మారింది. తాజాగా జెట్టి వెంకటేశ్వర రావు, కోటేశ్వర రావు హత్య లు పల్నాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో రెండు మర్డర్ లకు సంబంధించి ప్రధాన కారణం ఆధిపత్య పోరు అని తేల్చారు… హత్యకు గురైన ఇద్దరూ చాలా కాలం గా టీడీపీలో కొనసాగుతున్నారు… ఈ కేసులో ప్రధాన ముద్దాయి A1 గా ఉన్న జవిశెట్టి శ్రీను అనే వ్యక్తి మొన్న ఎన్నికల సమయంలో 2024లో వైసిపి పార్టీ నుండి టిడిపి పార్టీలో చేరారు… మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి కుడి భుజంగా పని చేసేవారని అక్కడి వారు చెబుతున్నారు.

రెండో ముద్దాయి తోట వెంకటరామయ్య కు A1 ముద్దాయి అయినా జవిశెట్టి శ్రీను దగ్గరి బంధువు. స్థానిక గ్రామాలలో టిడిపి నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడం ఆదిపత్య పోరు వల్ల ఈ ఘటన జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, చంపుకునే అంత ఆధిపత్య పోరు ఉండకపోవచ్చని…కానీ వైసిపి పార్టీ నుండి టిడిపి పార్టీలోకి వచ్చిన వారు రెచ్చగొడుతూ ఒకరిపై ఒకరు గొడవపడేలా చేస్తున్నారని టిడిపి కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. అయితే , నియోజకవర్గం లో కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నా.. ఎమ్మెల్యే జూలకంటి పట్టించు కోవటం లేదనే టాక్ వినిపిస్తోంది… ఇదే గ్రామంలో గతంలో చంద్రయ్య హత్య కు గురయ్యా రు… ఈ డబుల్ మర్డర్ కేసులో మాజీ ఎమ్మెల్యే పిఆర్కె..అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి ముద్దాయిలుగా చేర్చారు… ఈ ఘటనపై పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఎస్పీ స్థాయి అధికారి విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ ఘటనపై లక్షల రూపాయలు అకౌంట్స్ లో బదిలీలు అయినట్లు పోలీసుల సమాచారం. కాగా, ఇటీవలే మహానాడు లో ఈ ఘటన ఆధారంగా సంచలన వ్యాఖ్యలు చేశారు…. పార్టీలో కొందరు కోవర్టులు చేరి తమ అజెండా అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు… పార్టీలోకి ఎంతో మంది వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారని…. కార్యకర్తలు శాశ్వతమని చెప్పుకొచ్చారు. అయితే, పల్నాడులో వరుస గా చోటు చేసుకుంటున్న పరిణామాలతో గ్రామాల్లోని ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు… రాజకీయ పార్టీల నేతల ఆధిపత్య పోరులో తాము బలి అవుతాన్నామని వాపోతున్నారు. పల్నాడు గడ్డ పైన ఈ రక్త చరిత్రకు ముగింపు పలికి.. శాంతికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.