అంగట్లో పెమ్మసాని సూత్రాలు.!

The Ten Principles of Pemmasani: సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు. కూటమి ఏడాది పాలనతో పాటూ పలు కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.. వన్ టైమ్ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మిగిలిపోవద్దని.. నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. తానే స్వంయగా రోజుకు నలుగురు ఎమ్మెల్యేలతో సమావేశమవుతానని.. అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయని పరోక్షంగా హెచ్చరించారు. నియోజకవర్గాల్లో కార్యకర్తల మంచిచెడును పట్టించుకోవాలని కూడా సూచించారు. అయితే ఆ సమావేశం తర్వాత సోషల్ మీడియాలో ఓ మెసేజ్ బాగా వైరల్ అవుతోంది.

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎమ్మెల్యేలకు పది సూత్రాలు చెప్పారని.. ‘గోల్డెన్ వర్డ్స్ బై పెమ్మసాని’ అంటూ సోషల్ మీడియాలో పది సూత్రాలను వైరల్ చేస్తున్నారు. ఈ పది సూత్రాలు పాటిస్తే రాజకీయాల్లో తిరుగు ఉండదు.. ఎన్నికల్లో గెలుపు ఖాయం అనే రేంజ్‌లో ప్రచారం చేస్తున్నారు. ఆ పది సూత్రాలు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

టీడీపీ ఎమ్మెల్యేలకు పెమ్మసాని చెప్పిన పది సూత్రాలు ఈ విధంగా ఉన్నాయి: The Ten Principles of Pemmasani..!

  1. నిస్వార్ధంగా కార్యకర్తని పేరు పెట్టి పిలిస్తే వాళ్ల ఇంట్లో కుటుంబ సభ్యుడులా ఫీల్ అయి జీవితాంతం పార్టీకి సేవ చేస్తాడు.
  2. ఒక విద్య సంస్థలో మా పిల్లలకి ఒక సీటు ఇప్పించు అని వస్తారు అది చేయగలం చేయాలి అది మన బాధ్యత.
  3. నా పొలంలో సర్వే నెంబర్ తప్పు పడింది అది సరి చేయించండని వస్తారు.. స్పాట్‌లో ఎమ్మార్వోకు ఫోన్ చేసి చెబితే త్వరగా ఫాస్ట్ గా పని అవుతుంది.
  4. మా వాడికి జాబ్ కావాలి అనీ వస్తాడు కార్యకర్త. ఆ ఆఫీస్‌లో ఖాళీ ఉంది అనీ చెబితే నిజంగా అక్కడ ఖాళీ ఉంటే అది మన ఆఫీస్ ద్వారా Follow Up చేయించి జాబ్‌లో పెట్టించాలి.
  5. ప్రతి దానికి లెటర్ ఇవ్వకూడదు అది పని అయ్యేటట్టు ఉంటేనే లెటర్ ఇవ్వాలి.
  6. ముఖ్యంగా పార్టీ కోసం నిస్వార్థంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉన్నా నాయకులు వచ్చినప్పుడు వెయిట్ చేయించకుండా డైరెక్ట్‌గా కలవాలి.. ఆ విధంగా మన స్టాఫ్‌ను కూడా ప్రిపేర్ చేసుకోవాలి.
  7. చాలా వరకు మనం చేయగలం.. ఒకవేళ చేయలేక పోతే ఇది అవ్వదని గట్టిగా క్లారిటీగా చెప్పాలి.
  8. మన PAల పెత్తనం తగ్గినప్పుడు మన విలువ పెరుగుతుంది.
  9. కోవర్ట్‌లను గుర్తించలేనప్పుడు మన పదవి మునిగిపోయే పడవ లాంటిది.
  10. ఎలక్షన్ టైంలో మనతో ఉన్నవాళ్లు ఈ రోజు మన పక్కన లేనప్పుడు మనం పార్టీకి ద్రోహం చేసినవాళ్ళం అవుతాము. ఎందుకంటే వారి శ్రమే కదా ఈ రోజు మనకి ఈ హోదా.

ఇలా పది సూత్రాలను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు. నిజంగా పెమ్మసాని చంద్రశేఖర్ ఇదంతా చెప్పారా అనేది క్లారిటీ లేదు. కొంరు తెలుగు తమ్ముళ్లు మాత్రం ఈ పది సూత్రాలను పాటించడం కష్టమని తేల్చేశారు.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/how-to-apply-for-annadata-sukhibava-scheme-online-jjust-log-on-to-official-website/