గుడివాడలో వైసీపీకి దిక్కెవరు..?

రాజకీయాలలో ఎప్పుడు ఎవరి ప్రస్థానం ఎలా ముగుస్తుందో ఎవరికీ తెలియదు. రెండు దశాబ్దాలుగా కృష్ణా జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకొని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసిన ఆ మాజీ మంత్రికి ప్రస్తుతం నియోజకవర్గంలో వ్యతిరేక గలం వినిపిస్తుంది . ఒకరి తర్వత ఒకరుగా నేతలు పార్టీని వీడుతుండటం ఆ నియోజకవర్గ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. రోజు రోజుకు పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. దీంతో ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ ప్రస్థానం ముగిసినట్టేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత 20ఏళ్లుగా ఆ నియోజకవర్గాన్ని ఏలిన ఆ మాజీ మంత్రి హవా ఇప్పుడు లేదంటూ పార్టీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ జెండా నియోజకవర్గంలో ఎగురుతుందా? భవిష్యత్తులో ఆ పార్టీకి దిక్కెవరు..? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం గతంలో నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడు ఆ ప్రాంతం నుండి పోటీ చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పటి నుండి గుడివాడ అంటే తెలుగు నాడు ప్రజలలో ఎంతో అభిమానం . కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో నందమూరి కుటుంబానికి చెందిన వారెవరు గుడివాడలో గెలవలేదు . గుడివాడలో సొంతంగా పార్టీ స్థాపించి నందమూరి హరికృష్ణ పోటీ చేసి ఓడిపోయారు.ఆ తర్వాత జరిగిన పరిణామాలలో రావి కుటుంబం నందమూరి కుటుంబానికి దగ్గరగా ఉండటం వారే టిడిపిలో అంతా అన్నట్లుగా ఉండేది . కానీ 2004లో టిడిపిలో గుడివాడ సీటు పొందిన కొడాలి శ్రీ వెంకటేశ్వరావు నాని ఆ తర్వాత ఏకంగా గుడివాడలో రెండు దశాబ్దాలు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశారు. తాను అందుబాటులో లేకపోయినా తన షాడో తో అన్ని కార్యక్రమాలను నిర్వహించేవారు.

2008లో కొడాలి నాని టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడే అక్రమ ఆస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ చంచలగూడ జైలుకు వెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న నాని వైఎస్ జగన్ ని కలవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పుడే ఆయన పార్టీ మారుతున్నారని అధిష్టానం భావించి కొడాలి నానిని అప్పటి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మందలించారు. దీంతో నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కేవలం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా ఒంటెద్దు పోకడల వల్లే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని టీడీపీకి తనకు ఎటువంటి సంబంధం లేదని కొడాలి నాని తెలిపారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారులు రాకపోయినా సరే గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని భారీ మెజార్టీతో టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి వైసీపీకి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీపై త్రివ స్థాయిలో విరుచుకుపడేవారు కొడాలి నాని.

కొడాలి నాని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో నారా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తే లెక్కలు సరిపోతాయని అప్పట్లో వైసీపీ భావించేది. అందులో భాగంగానే వైసీపీని విమర్శించిన ప్రతిసారి టిడిపి పై కొడాలి నాని అనే మిస్సైల్ ను వైసీపీ ఉపయోగించేది. ప్రతిపక్షంలో ఉండటం తనకు మద్దతుగా పార్టీకి అండగా ఉంటున్న నానిని అధినేత జగన్ కూడా చాలా ఎక్కువగా అభిమానించేవారు. అందుకే వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనకి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా గుడివాడ రాజకీయాలలో మంత్రి పదవి చేసిన వారు ఎవరు తిరిగి గెలవలేదని కానీ తాను తప్పక గెలుస్తానని తనకు గుడివాడ ప్రజల అండ ఉందని తెలిపారు. అయితే ఏ రోజు కూడా గుడివాడ ప్రజలకి అందుబాటులో లేడు. తన వ్యవహారాలన్నీ తన షాడో ఎమ్మెల్యే దుక్కిపాటి శశిభూషణ్ నిర్వహించేవారు. నానికి తెలియకుండా చాలా విషయాలు దుక్కిపాటి డీల్ చేయటం తనకు నచ్చిన వారిని అందలాలు ఎక్కించడం చేసేవారు.

గత ఎన్నికల్లో కొడాలి నాని ఓటమి తర్వాత కనీసం పార్టీలోని నాయకులను పట్టించుకోవటం లేదని రెండు మూడు సార్లు ఈ విషయాన్ని మాజీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ మధ్యకాలంలో స్థానికంగా పార్టీకి చెందిన వారికి పదవులు కేటాయింపులో కూడా దుక్కిపాటి శశిభూషణ్ తన మద్దతుదారులకు ఇవ్వటం..ఇదేమని ప్రశ్నిస్తే నువ్వు ఎవరివి అంటూ పార్టీ చెందిన ముఖ్య నేతలకు వార్నింగ్ ఇవ్వడంతో. గుడివాడ వైసీపీ లో ముఖ్య నేతలు రాజీనామా బాట పట్టారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను పట్టించుకోని పరిస్థితులను జీర్ణించుకోలేని పార్టీ ముఖ్య నేత మండలి హనుమంతరావు తన పదవులను రాజీనామా చేయడంతో పాటు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. గుడివాడలో ప్రస్తుతం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వెనిగండ్ల రాము దెబ్బకు వైసీపీ ముఖ్య నేతలు ఎవరు బయటికి రావటం లేదు. కొడాలి నాని అనారోగ్య పరిస్థితుల వల్ల గుడివాడలో ఎవరికి అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో దుక్కిపాటి శశిభూషణ్ వ్యవహారశైలి నచ్చక వైసీపీలోని ముఖ్య నాయకులు పార్టీకి ఒక్కొక్కరు దూరమవుతున్నారు .

ప్రస్తుత గుడివాడలో వైసీపీకి దిక్కెవరు అన్న చర్చ నడుస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే గుడివాడలో వైసీపీ గెలిచే ఛాన్సే లేదంటున్నారు కార్యకర్తలు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన యాదవ సామాజిక వర్గానికి చెందిన కటారి ఈశ్వర్ కుమార్ కుమార్తెను వైసీపీలోకి తీసుకురావాలని కొడాలి నాని ప్రయత్నిస్తున్నారు . తద్వారా యాదవ సామాజిక వర్గంతో పాటు బీసీ ఓటు బ్యాంకు పార్టీకి అండగా ఉంటుందని కొడాలి వ్యూహం. కానీ మున్సిపాలిటీ పరిధిలో అత్యంత ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజిక వర్గానికి ఏమాత్రం కూడా విలువనేని నేపథ్యంలో కొడాలి నానితో తాము ఉండలేమని బహిరంగంగానే మండలి హనుమంతరావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గుడివాడలో ఐసీయూలో ఉన్న వైసీపీ రాబోయే రోజుల్లో ఏ పరిస్థితుల్లో ఉంటుందోనని రాజకీయ వర్గాలలో టాక్.