కొత్త మోడల్ గురూ…

ఇండియాలో ప్రముఖ బైక్ తయారీదారు సంస్థ హీరో మోటోకార్ప్ అత్యంత ప్రజాదరణ పొందిన స్ల్పెండర్ ప్లస్ 2025 మోడల్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. డిజైన్ పరంగా పెద్దగా మార్పలు చేయనప్పటికీ అద్భుతమైన లుక్ లో కనిపిస్తుంది. చిన్న చిన్న మార్పులను మాత్రమే చేసింది. అయినా కూడా కస్టమర్లను ఈ బైక్ చాలా ఆకట్టుకుంటుంది. స్ప్లెండర్ ప్లస్ లైనప్ లో స్ల్పెండర్ ప్లస్, స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్, స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్ 2.0 వేరియంట్లను తీసుకువచ్చింది. ఓల్డ్ మోడల్ బైక్ లో ఏ ఇంజిన్ అయితే ఇచ్చారో ఈ స్ల్పెండర్ ప్లస్ 2025మోడళ్లలోనూ దాన్నే కొనసాగించారు. గ్రాఫిక్స్ పరంగా కొన్ని మార్పులను చేసింది. స్పోర్టీ లుక్ ను జోడించారు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఇచ్చారు. సీటు, లగేజీ ర్యాక్ లో మార్పులు చేశారు. అయితే ఇవి టాప్ ఎండ్ మోడళ్లకే పరిమితం చేశారు.