
బంగారం ధరలకు రెక్కలొచ్చాయ్…. బంగారం ధరలను చూస్తుంటే వామ్మో అనాల్సిందే… గోల్డ్ షాపుల వైపుకు వెళ్లడం కాదు కదా.. ఆ షాపులు కనిపిస్తేనే మొహం తిప్పేస్తున్నారు సామాన్య ప్రజలు. మూడు రోజుల్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. పెరుగుతున్న స్పీడ్ చూస్తుంటే.. ఇక తులం బంగారం లక్ష రూపాయలు టచ్ చేస్తుందని అనిపిస్తోంది.బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతయ ఆర్థిఉద్రిక్తతలతో గోల్డ్ రేటు చుక్కలనంటుంతోంది. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 96 వేల 45కు చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 96వేల 430 వద్ద ట్రేడవుతోంది