స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురుంచి విన్నారా..?!

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి ప్లాన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. వీటిని మీ లక్ష్యాలు, టైమ్ ఫ్రేమ్, రిస్క్ సామర్థ్యం ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అవి..

లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్..
గడువు: 5–10 సంవత్సరాల కంటే ఎక్కువ. ఈ ప్లాన్ లో బలమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ(Large Cap, Blue Chip stocks) ల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఉదా: Reliance, TCS, HDFC Bank, Infosys వంటి మొదలైన స్టాక్‌లు.
SIP (Systematic Investment Plan) ద్వారా పెట్టుబడి పెంచుకుంటూ పోవడం మంచిది.

షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్..
గడువు: 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు. Mid-cap, Small-cap stocksలో పెట్టుబడి పెట్టవచ్చు.
మార్కెట్ ట్రెండ్, టెక్నికల్ అనాలసిస్ ఆధారంగా షార్ట్ టర్మ్ ప్లాన్స్ టార్గెట్ చేసుకోవచ్చు.

థీమ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్..
గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇండియా, EVs, ఫైనాన్షియల్ టెక్నాలజీ (FinTech) వంటి పలు రంగాల్లో వచ్చే అవకాశాల మీద ఫోకస్ పెట్టే ప్లాన్ ఇది.
కొన్ని థీమ్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్‌లను సెల్ఫ్ గా ఎంపిక చేసుకోవచ్చు.

డివిడెండ్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్..
రెగ్యులర్ గా వచ్చే ఆదాయం లేదా రాబడి కోసం డివిడెండ్ చెల్లించే కంపెనీల్లో పెట్టుబడి పెట్టవచ్చు.
ఉదా: ITC, Coal India, Hindustan Zinc వంటి కంపెనీలు.

ఇండెక్స్ ఫండ్ & ETFs..
నిఫ్టీ 50, సెన్సెక్స్ లాంటి ఇండెక్స్‌లను ట్రాక్ చేసే ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.
తక్కువ ఖర్చుతో, డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో కలిగి ఉండే ఈ ప్లాన్ ను తక్కువ టైం, రిటర్న్స్ పెట్టాలనుకునేవారు ఎంపిక చేసుకోవచ్చు.

SIP ద్వారా స్టాక్ ఇన్వెస్ట్మెంట్..
స్టాక్స్‌లోనూ SIPలాగా నెల నెల పెట్టుబడి పెట్టవచ్చు.
ఇది మార్కెట్ టైమింగ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది.

గమనించాల్సినవి:
రిస్క్ అనాలిసిస్ చేయాలి.
పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ తప్పనిసరి.
ఆర్థిక లక్ష్యాలు, ప్లానింగ్స్ అనేవి స్పష్టంగా ఉండాలి.
కనీసం 3- 5 సంవత్సరాల టర్మ్ లో పెట్టుబడులు చేయడం మంచిది.