నెల గ్యాప్ లో మెగా బ్రదర్స్ రాబోతున్నారా..?

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ సినిమాలు నెల గ్యాప్ లో రాబోతున్నారని ఇప్పుడు రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ వార్త లీకైనప్పటి నుంచి అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఈ సినిమాల పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇంతకీ.. చిరు – పవన్ ఏ నెలలో.. ఏ తారీఖున తమ సినిమాలను రిలీజ్ చేయనున్నారు. ఈ రెండు సినిమాల అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేది ఎప్పుడు..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఎప్పటి నుంచో నటిస్తున్న మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదాపడిన ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంది. థియేటర్స్ లోకి వచ్చేందుకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఇంతకీ.. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడంటే.. జూన్ 12న అని తెలిసింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై మరింతగా క్లారిటీ వచ్చిన తర్వాత అపిషియల్ గా వీరమల్లు రిలీజ్ డేట్ ప్రకటిస్తారని సమాచారం.

ఇక మెగాస్టార్ విషయానికి వస్తే.. విశ్వంభర సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి. గేమ్ ఛేంజర్ కోసం సంక్రాంతి డేట్ ని వదిలేసిన విశ్వంభర మే 9న రావాలి అనుకుంది కానీ కుదరలేదు. ఇప్పుడు ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరి.. రిలీజ్ ఎప్పుడంటే.. జులై 24న అని తెలిసింది. అంటే.. జూన్ లో పవర్ స్టార్ వీరమల్లు వస్తే.. జులై లో మెగాస్టార్ విశ్వంభర రావడం అంటే.. మెగా అభిమానులకు పండగే అని చెప్పచ్చు. ఈ రెండు సినిమాల కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో వీరమల్లు కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని టాక్. మరి.. చిరు విశ్వంభర బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.