మహేష్‌, రాజమౌళి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ క్రేజీ కాంబో మూవీ గురించి ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతంది కానీ.. మేకర్స్ నుంచి ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావడం లేదు. జక్కన్న తన రూల్స్ బ్రేక్ చేసి.. సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. త్వరలో అనౌన్స్ మెంట్ ఉంటుందని వార్తలు అయితే వస్తున్నాయి కానీ.. ఇంత వరకు రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఎస్ఎస్ఎంబి 29 మూవీ రిలీజ్ ఎప్పుడు..? అసలు జక్కన్న ప్లాన్ ఏంటి..?

ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీకి సంబంధించి ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మంచి ముహుర్తం చూసుకుని ఈ సినిమాని అనౌన్స్ చేస్తారని.. దీని కోసం ఓ స్పెషల్ వీడియో కూడా రెడీ చేస్తున్నారని తెలిసింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంత వరకు ఎవరూ చేయని విధంగా.. హయ్యస్ట్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను 1000 కోట్లతో నిర్మించనున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీకి టాలీవుడ్, బాలీవుడ్ ఆర్టిస్టులే కాదు.. హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండడం విశేషం.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని 2027 మార్చి 25న రిలీజ్ చేయాలని జక్కన్న డేట్ ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఆ రోజు గురువారం కావడమే కాదు, ఆ వారం మార్చి 26వ తేదీకి గుడ్ ఫ్రైడే సెలవు కూడా ఉండడంతో లాంగ్ వీకెండ్ కలిసొచ్చే అవకాశం ఉంది. అదే డేట్‌కు 2022లో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అదే డేట్‌ను మహేష్ రాజమౌళి క్రేజీ పాన్ వరల్డ్ మూవీని రిలీజ్ చేస్తే, మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారట. ప్లాన్ బాగానే ఉంది. మరి.. జక్కన్న అనుకున్నట్టుగా ఈ భారీ చిత్రం 2027లో మార్చి 25న రిలీజ్ చేస్తారా..? అసలు ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమేనా..? కాదా అనేది తెలియాల్సివుంది.