
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న భారీ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. వాయిదా పడుతూనే ఉంది. ఈమధ్య కాలంలో మార్చి 28న రిలీజ్ అని ప్రకటించారు. పోస్ట్ పోన్ అయ్యింది. ఆతర్వాత మే 9న వీరమల్లు రావడం ఖాయం అన్నారు కానీ.. ఇది కూడా డౌటే అని ప్రచారం జరుగుతోంది. అయితే.. వీరమల్లుకు ఓటీటీ సంస్థ కండీషన్ పెట్టిందని తెలిసింది. ఇంతకీ.. ఏంటా కండీషన్..? వీరమల్లు ఈసారైనా వస్తుందా..? మళ్లీ వాయిదా పడుతుందా..?
వీరమల్లు చిత్రాన్ని మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు. ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రెండు పాటలను కూడా రిలీజ్ చేశారు. అయితే.. ప్లాన్ చేసినట్టుగా షూటింగ్ జరగలేదు. దీంతో మే 9కి పోస్ట్ పోన్ చేశారు. నెల రోజులే టైమ్ ఉంది కానీ.. మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో వీరమల్లు వస్తుందా..? వాయిదా పడనుందా అనేది మరోసారి ఆసక్తిగా మారింది. ఇక అసలు విషయానికి వస్తే.. వీరమల్లు మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ దక్కించుకుంది. అయితే.. ఇప్పటికే ఎన్నో సార్లు పోస్ట్ పోన్ అవ్వడంతో ఈసారి ఖచ్చితంగా మే 9న రిలీజ్ చేయాలని అమెజాన్ సంస్థ కండీషన్ పెట్టిందట. ఒకవేళ మే 9న వీరమల్లు మూవీని రిలీజ్ చేయకపోతే డీల్ క్యాన్సిల్ చేసుకుంటామని.. లేదా చెప్పిన అమౌంట్ కి 50 శాతం తగ్గించి ఇస్తామని చెప్పారట.
ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కు వీరమల్లు మేకర్స్ తెలియచేశారని సమాచారం. ప్రస్తుతం తన చిన్న కుమారుడ్ని చూడడం కోసం సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ తిరిగి వచ్చిన తర్వాత వీరమల్లు షూట్ లో జాయిన్ అవుతారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే చాలా ఆలస్యం అవ్వడం వలన నిర్మాత ఏఎం రత్నంకు భారీగా బడ్జెట్ పెరిగింది. అందుకనే ఈ మూవీ షూటింగ్ ను ఇక పోస్ట్ పోన్ చేయకుండా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట పవర్ స్టార్. కేవలం పవన్ కళ్యాణ్ తో నాలుగైదు రోజుల షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. ఇది కంప్లీట్ అయితే.. సినిమా మొత్తం పూర్తయినట్టే అని తెలిసింది. పవర్ స్టార్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో భారీగా ఓపెనింగ్స్ వస్తాయని.. బ్లాక్ బస్టర్ విజయం సాధించడం ఖాయమని అంచనాలు ఉన్నాయి. మరి.. ఏం జరగనుందో చూడాలి.