
రఫ్ నోట్ ప్రొడక్షన్ పతాకంపై రాజ్ తరుణ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో ‘ప్రేమిస్తే’ భరత్ కీలక పాత్రను పోషించనున్నాడు. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. కాదల్, పట్టియల్, కాలిదాస్ వంటి చిత్రాలలో తన విభిన్న నటనతో పేరు తెచ్చుకున్న భరత్.. ఈ సినిమాలో ఎమోషనల్ అండ్ ఎనర్జిటిక్ పాత్రను పోషిస్తున్నాడు. తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ చేరికతో ఈ ద్విభాషా చిత్రానికి పాన్ సౌత్ ఇండియన్ రేంజ్ వచ్చినట్లు అయింది. ఈ సందర్బంగా దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ భరత్ ఎంతో నిబద్దత గల నటుడని, ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర కథలో ఎంతో కీలకమని చెప్పారు. కథను మలుపు తిప్పే ఈ పాత్ర ఆయన కెరీర్‌కు కూడా ఎంతో ప్లస్ అయ్యే విధంగా ఉంటుందన్నారు.