పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా..?

Actress Meena Political Entry: సీనియర్ హీరోయిన్ మీనా నాటి నుంచి నేటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించి మెప్పించింది. మన పక్కంటి అమ్మాయిలా.. ఇంకా చెప్పాలంటే.. మన అమ్మాయే అనేలా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన మీనా ఈమధ్య కాలంలో మళ్లీ మేకప్ వేసుకుంది.. మళ్లీ తన నటనతో అలరిస్తుంది. అయితే.. ఇప్పుడు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. నిజంగా మీనా పాలిటిక్స్ లోకి రాబోతుందా..?

మీనా ఈమధ్య తన భర్త సాగర్ ను కోల్పోయింది. ఆమెకు ఓ కుమార్తె ఉంది. అయితే.. మీనా మళ్లీ పెళ్లి చేసుకోబోతోందని.. గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉంది. అది కూడా ఎవర్నో కాదు.. కోలీవుడ్ స్టార్ ధనుష్, మీనా పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరగడంతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. తన గురించి.. తన రెండో పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పుడు మీనా క్లారిటీ ఇస్తూనే ఉంది. తను రెండో పెళ్లి చేసుకుంటున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చేసింది. అయితే.. భవిష్యత్ లో పెళ్లి చేసుకుంటానేమో కానీ.. ఇప్పటి వరకు సెకండ్ మ్యారేజ్ గురించి ఎలాంటి ఆలోచన లేదని ఆమధ్య తెలియచేసింది.

ఇప్పుడు మీనా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుందని కోలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తోంది. ఇంతకీ ఏ పార్టీలో అంటే.. తమిళనాడులో బీజేపీలో చేరాలి అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మీనా ఎప్పుడు తనకు రాజకీయాల పై ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా చెప్పలేదు. అయితే.. ఇటీవల బీజేపీ నాయకుడు జగదీష్ ధంఖర్ ను కలవడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీనా బీజేపీలో జాయిన్ అవుతారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

తమిళనాడులో సినిమా, రాజకీయాల మధ్య చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తమిళనాడు బీజేపీలో ఇప్పటికే నటి ఖుష్బూ సుందర్ ఉన్నారు. Actress Meena Political Entry.
ఇప్పుడు మీనా కూడా చేరితే భారతీయ జనతా పార్టీకి మరో స్టార్ ఫేస్ అవుతుంది. మరో వైపు కోలీవుడ్ స్టార్ విజయ్ పార్టీ పెట్టడంతో ఈసారి తమిళనాడులో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే.. మీనా రాజకీయాల్లోకి రావడం ఖాయమనే అనిపిస్తుంది. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై మీనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/why-sreeleela-left-akhils-lenin-what-circumstances-made-her-to-leave-this-master-piece/