అఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..?

అక్కినేని అఖిల్, జైనబ్ ఎంగేజ్ మెంట్ జరగడం తెలిసిందే. ఆమధ్య నాగార్జున.. అఖిల్, జైనబ్ లవ్ గురించి అనౌన్స్ చేసి సర్ ఫ్రైజ్ చేశారు. ఎంగేజ్ మెంట్ జరిగిన తర్వాత మ్యారేజ్ గురించి అప్ డేట్ ఇస్తారనుకున్నారు. అయితే.. ఇంత వరకు అఖిల్ మ్యారేజ్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు. ఇప్పుడు అఖిల్ పెళ్లి ముహుర్తం ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా నిజంగానే మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..? అఖిల్ పెళ్లి ఎప్పుడు..? లెనిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడు..?

అఖిల్, జైనబ్ పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయ్యిందని.. జూన్ 6న పెళ్లి అని అక్కినేని కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న సమాచారం. అయితే.. ఇది నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. అఖిల్ పెళ్లిని చాలా గ్రాండ్ గా చేయాలి అనుకుంటున్నారు కింగ్ నాగార్జున. నాగచైతన్య పెళ్ళిని అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు నిర్వహించారు. అఖిల్ పెళ్లి కూడా అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఘనంగా చేస్తారని టాక్ వినిపిస్తోంది. మ్యారేజ్ డేట్ దగ్గరకు వస్తుండడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది.

ఇక లెనిన్ విషయానికి వస్తే.. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న విలేజ్ లవ్ స్టోరీలో అంతకు మించి యాక్షన్ కూడా ఉంటుందట. అలాగే డివోషనల్ టచ్ కూడా ఉంటుందని గ్లింప్స్ ని బట్టి అర్థమౌతోంది. దీనికి ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అఖిల్ కు జంటగా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు కానీ.. కుదిరితే దసరాకి విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్. మరి.. త్వరలో అఖిల్ పెళ్లి గురించి.. లెనిన్ రిలీజ్ గురించి క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.