
Akhil Lenin Story Leaked: అక్కినేని అఖిల్.. తన ప్రతి సినిమాకి చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు కానీ.. సరైన సక్సెస్ మాత్రం రావడం లేదు. అఖిల్.. అఖిల్ అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసినా.. ఫస్ట్ సక్సెస్ సాధించడం కోసం నాలుగో సినిమా వరకు వెయిట్ చేయాల్సివచ్చింది. ఆతర్వాత అయినా సక్సెస్ కంటిన్యూ చేస్తాడనుకుంటే.. అలా జరగలేదు. చాలా కథలు విన్న తర్వాత లెనిన్ అనే స్టోరీని ఒకే చేశాడు. ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు కానీ.. స్టోరీ ఏంటి అనేది లీక్ చేయలేదు. ఇప్పుడు లెనిన్ స్టోరీ ఏంటి అనేది లీకైంది. ఇంతకీ.. లీకైన లెనిన్ స్టోరీ ఏంటి..? ఈ సినిమా ఎలా ఉండబోతుంది..?

అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు నిరాశపరిచాయి. నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో తొలి విజయాన్ని సాధించాడు. ఆ సినిమా తర్వాత స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఏజెంట్ అనే సినిమా చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఆతర్వాత మురళీ కిషోర్ అబ్బూరు చెప్పిన లెనిన్ కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఇందులో అఖిల్ కు జంటగా శ్రీలీల నటిస్తుంది.

అఖిల్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన లెనిన్ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే.. లెనిన్ కథ ఎలా ఉండబోతుందో గ్లింప్స్ తో హింట్ ఇచ్చారు కానీ.. అసలు కథ ఏంటి అనేది రివీల్ చేయలేదు. తాజాగా లెనిన్ కథ ఎలా ఉండబోతుందో లీకైంది. ఇంతకీ.. లీకైన లెనిన్ స్టోరీ ఏంటంటే.. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న కథ ఇది. ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. అలాగే ఈ కథలో మరో లేయర్ గా ఆలయానికి సంబంధించిన కథ కూడా ఉంటుందట. పరువు హత్య, ఆలయానికి సంబంధం ఏంటి..? ఈ హత్య, టెంపుల్ తో హీరోకు సంబంధం ఏంటి..? ఎలా లింక్ చేసారనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట.

అలాగే ఇందులో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుందని.. ఈ ఎపిసోడ్ సినిమానికి హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ మూవీ కోసం చిత్తూరు స్లాంగ్ నేర్చుకున్నాడు అఖిల్. గెటప్ కూడా కొత్తగా ఉంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మ్యారేజ్ బిజీలో ఉండడం వలన షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన అఖిల్ ఇప్పుడు తాజా షెడ్యూల్ లో జాయిన్ అవుతున్నాడు. ఈ షెడ్యూల్ లో.. అఖిల్ పై యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి కథ కొత్తగా ఉంది. పైగా లెనిన్ అనే టైటిల్ పెట్టడం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నవంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి.. లెనిన్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి. Akhil Lenin Story Leaked..!
Also Read: https://www.mega9tv.com/cinema/boyapatisrinu-and-chiranjeevi-latest-movie-update/