
అక్కినేని అఖిల్.. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత చాలా కథలు విని ఫైనల్ గా లెనిన్ కథతో సినిమా చేయాలని ఫిక్స్ అవ్వడం తెలిసిందే. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. అయితే.. ఈ మూవీ స్టార్ట్ అయ్యిందని వార్తలు రావడం.. అఖిల్ బర్త్ డేకు గ్లింప్స్ రిలీజ్ చేయడమే కానీ.. ఆతర్వాత ఎలాంటి అవ్ డేట్ లేదు. ఇంతకీ.. లెనిన్ అప్ డేట్ ఏంటి..? ఈ క్రేజీ మూవీ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?
ఇది చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న సినిమా. ఇందులో అఖిల్ పల్లెటూరు యువకుడుగా నటిస్తున్నాడు. అఖిల్ కు జంటగా కిసిక్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.
కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అఖిల్ బ్లాక్ బస్టర్ సాధించాలి.. అభిమానులు తన పై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలని ఎంతో కష్టపడుతున్నాడు. అయితే.. కాలం కలిసి రావడం లేదు. ఈసారి మాత్రం ఎలాగైనా సరే.. సక్సెస్ సాధించాలని పట్టుదలతో వర్క్ చేస్తున్నాడు. ఇంతకీ అప్ డేట్ ఏంటంటే.. ఇటీవల అఖిల్ యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. ఇప్పుడు జూన్ లో క్లైమాక్స్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
అఖిల్.. యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎలా నటిస్తాడో.. ఇంతకు ముందు సినిమాల్లో చూశాం. ఇప్పుడు ఈ సినిమాలో కూడా యాక్షన్ వావ్ అనేలా ఉంటుందట. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ చిత్తూరు స్లాంగ్ నేర్చుకుని మరి వర్క్ చేస్తుండడం విశేషం. సాధ్యమైనంత ఫాస్ట్ గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలనే టార్గెట్ తో ఈ మూవీ టీమ్ వర్క్ చేస్తున్నారు. ఇంతకీ.. లెనిన్ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడంటే.. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే దసరాకి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. అయితే.. లెనిన్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.