
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీరిద్దరి బంధం, అనుబంధం గురించి తెలిసిందే. ఈ ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు బాగా సెట్ అవ్వడం వలనే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో అంటూ ఒకదానిని మించి మరోటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. అయితే.. గత కొంతకాలంగా బన్నీ, త్రివిక్రమ్ కలిసి నాలుగో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ.. ఈ క్రేజీ కాంబో మూవీ పట్టాలెక్కలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరి.. నిజంగానే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా..? అసలు తెర వెనుక ఏం జరిగింది..?
గుంటూరు కారం సినిమా కంప్లీట్ అయినప్పటి నుంచి త్రివిక్రమ్ బన్నీతో చేయనున్న సినిమా పైనే వర్క్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. బన్నీతో సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్.. బన్నీతోనే సినిమా అనుకుంటే.. బన్నీ అట్లీతో సినిమాని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. బన్నీ ఇలా చేయడంతో త్రివిక్రమ్ బాగా ఫీలయ్యాడట. అందుకనే.. బన్నీ కోసం వెయిట్ చేయకుండా వరుసగా రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఈ వార్త లీకైనప్పటి నుంచి బన్నీ, త్రివిక్రమ్ సినిమా ఉందా..? లేదా..? అనేది సస్పెన్స్ గా మారింది.
మరి.. ఈ క్రేజీ కాంబో మూవీ ఉందా లేదా అంటే.. ఉందంటే ఉంది.. లేదంటే లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి అని టాక్ వినిపిస్తోంది. ఇది సరే.. త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న రెండు సినిమాలు ఏంటంటే.. ఒకటి విక్టరీ వెంకటేష్ తో. ఎప్పటి నుంచో వెంకీ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారు కానీ.. వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఈ కాంబో సెట్ అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించనున్నారు. ఈ క్రేజీ కాంబో మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అప్పటికి సినిమా రెడీ కాదనే ఉద్దేశ్యంతో సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇక త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న రెండో సినిమా ఎవరితో అంటే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో అని తెలిసింది. చరణ్, త్రివిక్రమ్ కాంబో మూవీని కూడా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు కానీ.. కుదరడం లేదు. ఇప్పుడు సెట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ క్రేజీ కాంబో సెట్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంకీ సినిమా కంప్లీట్ అయిన తర్వాత చరణ్ తో సినిమాని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడట. అయితే.. చరణ్ పెద్ది సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా చేయాలి. అందుచేత చరణ్, త్రివిక్రమ్ కాంబో స్టార్ట్ కావడానికి టైమ్ పట్టచ్చు. ఏది ఏమైనా.. తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటే.. బన్నీతనతో కాకుండా అట్లీతో మూవీ చేస్తున్నాడనే కోపంతో.. వరుసగా రెండు సినిమాలు ప్లాన్ చేశాడట. దీంతో బన్నీ, త్రివిక్రమ్ మూవీ ఇప్పట్లో ఉండదు అనేది ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. మరి.. ఏం జరగనుందో చూడాలి.