బన్నీ బిగ్ సర్ ఫ్రైజ్ పై క్లారిటీ వచ్చేసిందిగా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఉంది. ఎప్పుడైతే పుష్ప.. పుష్ఫరాజ్ తగ్గేదేలే అన్నాడో ఆ క్యారెక్టర్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. పాన్ ఇండియా రేంజ్ లో బిగ్ స్టార్ అయ్యాడు. బాలీవుడ్ బడా మేకర్స్ బన్నీతో సినిమాలు చేసేందుకు క్యూకడుతున్నారు. అయితే.. బన్నీ ప్లాన్ మాత్రం వేరేలా ఉంది. ఇదిలా ఉంటే.. ఇటీవల బన్నీ వాసు.. గీతా ఆర్ట్స్ నుంచి బిగ్ సర్ ఫ్రైజ్ రానుందని ప్రకటించారు. దీంతో గీతా ఆర్ట్స్ ఇచ్చే ఆ బిగ్ సర్ ఫ్రైజ్ ఏంటి అనేది అందరిలో క్యూరియాసిటీని పెంచేసింది. ఇప్పుడు ఈ బిగ్ సర్ ఫ్రైజ్ పై క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ.. బన్నీ గురించి గీతా ఆర్ట్స్ ఇచ్చే బిగ్ సర్ ఫ్రైజ్ ఏంటి..?

గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే బిగ్ సర్ ఫ్రైజ్ అంటే.. అభిమానుల, సినీ అభిమానులు అందరూ అనుకున్నది ఏంటంటే.. త్రివిక్రమ్ తో సినిమాని ప్రకటిస్తారని. అయితే.. ఈ మూవీని త్రివిక్రమ్ బన్నీతో కాకుండా.. ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి.. గీతా ఆర్ట్స్ ఇచ్చే సర్ ఫ్రైజ్ ఏముంటుంది అంటే.. మెగాస్టార్ చిరంజీవితో సినిమాని కానీ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమాని కానీ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే.. ప్రచారంలో వాస్తవం లేదని తెలిసింది. ఐకాన్ స్టార్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

ఇంతకీ.. బన్నీ నెక్ట్స్ ఏంటంటే.. మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ పేరు వినిపిస్తోంది. బాసిల్ జోసెఫ్ పేరు వినగానే సినీ అభిమానులకు గుర్చొచ్చేది మిన్నల్ మురళీ. 2021లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సినిమా బాసిల్ కు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత జయ జయ జయ జయహే సెటైరికల్ కామెడీ హిట్ తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు జోసెఫ్. ఇప్పుడు బన్నీ, బాసిల్ కాంబో ఫిక్స్ అంటూ వార్తలు రావడం హాట్ టాపిక్ అయ్యింది. బన్నీకి మలయాళంలో మాంచి క్రేజ్ ఉంది. అందుచేత మలయాళ ఆడియన్స్ అంటే బన్నీకి స్పెషల్. పుష్ప 2 లో ఓ సాంగ్ లో మొదటి లిరిక్స్ మలయాళంలోనే పెట్టిన తన ఇష్టాన్ని తెలియచేశాడు.

ఇప్పుడు మలయాళ డైరెక్టర్ తో సినిమా చేయనున్నట్టుగా వార్తలు రావడంతో ఇది నిజమా..? కాదా..? అనేది ఆసక్తిగా మారింది. కేరళలో అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. ఇంత ప్రేమ చూపించే మలయాళ ఇండస్ట్రీ క్రియేటీవ్ డైరెక్టర్ తో బన్నీ సినిమా చేస్తే.. కేరళ ఆడియన్స్ కి పండగే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలిసింది. నాలుగు నెలల్లోనే ఈ సినిమాకి సంబంధించిన అపిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి.. గీతా ఆర్ట్స్ నుంచి బిగ్ సర్ ఫ్రైజ్ ఇదే అవుతుందా..? లేక వేరే సర్ ఫ్రైజ్ ఉందా..? తెలియాలంటే నాలుగు నెలలు వెయిట్ చేయాల్సిందే.