విశ్వంభర నుంచి అదిరిపోయే అప్డేట్!

Exciting Update From Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. మల్లిడి వశిష్ఠ్‌ తెరకెక్కిస్తోన్న విశ్వంభర సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఈ సినిమాని ప్రస్తుతానికి పక్కనపెట్టి చిరు.. అనిల్ రావిపూడితో సినిమాని చకా చకా కానిచ్చేస్తున్నారు. అయితే.. విశ్వంభర మూవీ కోసం మార్పుటు చేర్పులు చేస్తున్నారనే వార్త వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఈ మూవీలోని ఐటం సాంగ్ కోసం భారీ మార్పులు చేర్పులే చేయడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. విశ్వంభర మేకర్స్ ఏం చేస్తున్నారు..? రిలీజ్ ప్లాన్ ఏంటి..?

ఈ సినిమా షూటింగ్ ఐటం సాంగ్ మినహా అంతా పూర్తయ్యిందని తెలిసింది. ఈ మూవీకి స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే.. ఐటం సాంగ్ కి మ్యూజిక్ అందించే బాధ్యతను కీరవాణికి కాకుండా.. భీమ్స్ సిసిరోలియోకు అప్పగించారు. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణిని కాదని భీమ్స్ తో ఐటం సాంగ్ చేయిస్తుండడంతో ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది..? అనే క్యూరియాసిటీ పెరగింది. త్వరలోనే ఈ సాంగ్ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాలోని ఐటం సాంగ్ ను మిల్కీబ్యూటీ తమన్నాతో చేయిస్తే ఎలా ఉంటుందో అని మేకర్స్ ఆలోచించారని ఆమధ్య వార్తలు వచ్చాయి. తమన్నా ఇప్పటి వరకు చాలా ఐటం సాంగ్స్ చేసింది.. పైగా ఆమె చేసిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తమన్నాతోనే ఈ సాంగ్ చేయిస్తారని ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు ప్లాన్ మారింది. కన్నడ భామ నిశ్విక నాయుడును ఫైనల్ చేశారని ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రభుదేవాతో కలిసి ఈ బ్యూటీ డ్యాన్స్ అదరగొట్టింది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో డ్యాన్స్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. Exciting Update From Vishwambhara.

ఈ ఐటం సాంగ్ కోసం భీమ్స్ అదిరిపోయేలా మాస్ బీట్ రెడీ చేశారట. ఈ సాంగ్ విని మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక చిరు డేట్స్ ఇస్తే.. ఈ సాంగ్ షూట్ త్వరలో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట. అయితే.. చిరు ఇప్పుడు అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీ షూట్ లో బిజీగా ఉన్నారు. తాజా షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో చిరు, వెంకీ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక రిలీజ్ ప్లాన్ ఏంటంటే… అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారు. లేకపోతే.. అనిల్ రావిపూడితో చేస్తోన్న మూవీ తర్వాత రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా అని కూడా ఆలోచిస్తున్నారట. ఏది ఏమైనా త్వరలోనే రిలీజ్ డేట్ పై ఓ నిర్ణయం తీసుకోన్నారని సమాచారం. ఖైదీ నెంబర్ 150 లక్ష్మీ రాయ్ తో, వాల్తేరు వీరయ్యలో ఊర్వశీ రౌటేలతో ఐటం సాంగ్ చేశారు. ఈ రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మరి.. విశ్వంభరలో నిశ్విక నాయుడుతో చేసే ఐటం సాంగ్ ఎంత వరకు ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/chirus-ott-entry-is-starting-will-the-megastar-plan-is-going-to-success/