మహేష్ మూవీలో మరో స్టార్ హీరో.. నిజమేనా..?

బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎలాంటి హాడావిడి లేకుండా సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు జక్కన్న. ఇండియానా జోన్స్ తరహాలో సాగే యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ లా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ మూవీ గురించి మేకర్స్ అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇవ్వడం లేదు కానీ.. ఏదో ఇంట్రెస్టింగ్ న్యూస్ మాత్రం బయటకు వస్తూనే ఉంటుంది. తాజాగా ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీలో మరో స్టార్ హీరో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఎవరా స్టార్ హీరో..?

ఈ క్రేజీ మూవీలో మహేష్‌ తో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా నటిస్తున్నారనే విషయం తెలిసిందే. హాలీవుడ్ టెక్నీషియ‌న్‌లు వ‌ర్క్ చేస్తున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీర‌వాణి మ్యూజిక్‌, విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్టోరీ, పీఎస్ వినోద్ ఫొటోగ్రఫీ, క‌మ‌ల్ క‌ణ్ణ‌న్ వీఎఫ్ ఎక్స్ అందిస్తున్నారు. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయని తెలిసింది. అయితే.. ఇప్పటి వరకు షూటింగ్ కి ఎక్కువ టైమ్ తీసుకునే జక్కన్న ఇప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో స్పీడు పెంచాడని సమాచారం.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం.. కోలీవుడ్ స్టార్ విక్రమ్ ను రంగంలోకి దింపబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విక్రమ్ తో జక్కన్న చర్చలు పూర్తి చేశారని.. త్వరలో అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారనేది ఇన్ సైడ్ టాక్. ఆమధ్య పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. ఆతర్వాత అదే నిజమైంది. ఇప్పుడు విక్రమ్ విషయంలో కూడా అదే జరగనుందని సినీ అభిమానులు నమ్ముతున్నారు. నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో చిత్రీకరించే యాక్షన్ పార్ట్ ను హాలీవుడ్ ఫైట్ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరించనున్నారు. ఈ మూవీ గురించి రోజుకో వార్త బయటకు వస్తుండడంతో మరింత ఆతృతగా అప్ డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి.. జక్కన్న ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో చూడాలి.