
రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కర్మ స్థలం’. అర్చన శాస్త్రి, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా పూర్తి అయింది. ప్రస్తుతం ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. త్వరలోనే టీజర్, ట్రైలర్స్‌ను విడుదల చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని టీమ్ చెప్పింది.
మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల లాంచ్ అయింది. ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన మాట్లాడుతూ.. ‘‘మహిషాసుర మర్దిని కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తీస్తున్నారు. మంచి సబ్జెక్ట్, మంచి టైటిల్. క్వాలిటీ పరంగా ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటాయి’’ అని చెప్పారు.