ప్రభాస్ పై కోపంతో.. బన్నీకి ఓకే చెప్పిందా..?

దీపికా పడుకునే.. ఈ బాలీవుడ్ బ్యూటీ గత కొన్ని రోజులుగా వార్తలో నిలిచింది. కారణం.. ప్రభాస్, సందీప్ కాంబో మూవీ స్పిరిట్ కు సంబంధించి స్టోరీ లీక్ చేసిందని సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవ్వడం తెలిసిందే. దీపికా వెర్సెస్ సందీప్ రెడ్డి వంగ.. అనేట్టుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. ఇప్పుడు మరోసారి దీపిక హాట్ టాపిక్ అయ్యింది. మేటర్ ఏంటంటే.. బన్నీ, అట్లీ కాంబో మూవీలో నటించేందుకు ఓకే చెప్పింది. మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. సందీప్ పై కోపంతో బన్నీ మూవీ ఒప్పుకుందా..? లేక నిజంగానే క్యారెక్టర్ నచ్చి ఒప్పుకుందా..?

స్పిరిట్ మూవీలో నటించేందుకు దీపికా ముందుగా ఒప్పుకుంది. ఆతర్వాత తన వర్కింగ్ అవర్స్ ను 8 అవర్స్ నుంచి 6 అవర్స్ కు తగ్గించాలని.. అలాగే ప్రాఫిట్స్ లో షేర్ కావాలని డిమాండ్ చేసిందట. ఇవే కాకుండా.. తన స్టాఫ్ సాలరీస్ కూడా ప్రొడ్యూసర్సే పే చేయాలని.. ఇలా రోజుకో డిమాండ్ తన నుంచి రావడంతో సందీప్ రెడ్డి వంగ దీపికను ఈ మూవీ నుంచి తప్పించాడు. అంతే కాకుండా దీపిక చేయాల్సిన పాత్రను యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రితో చేయిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది దీపికకు పెద్ద షాకే. అందుకనే కోపంతో స్పిరిట్ మూవీలో తన క్యారెక్టర్ గురించి లీక్ చేసింది. ఇక అక్కడ నుంచి సందీప్ రెడ్డి వెర్సెస్ దీపిక అనేట్టుగా సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ అయ్యింది.

ఇదిలా ఉంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ క్రేజీ కాంబోలో రూపొందే మూవీలో దీపిక నటిస్తున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ మెంట్ వీడియో వచ్చినప్పటి నుంచి దీపిక తనేంటో తెలియచేయడం కోసమే.. ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందని సోషల్ మీడియాలో కొంత మంది ప్రచారం చేస్తున్నారు. మరో వైపు అలాంటిది ఏమీ లేదు.. ఈ మూవీలో తన క్యారెక్టర్ నచ్చడం వలనే ఓకే చెప్పిందని మరి కొందరు అంటున్నారు. మరో వార్త ఏంటంటే.. ఆల్రెడీ ప్రభాస్ తో కల్కిలో నటించింది. కల్కి 2 లో నటిస్తుంది. అందుచేత ప్రభాస్ స్పిరిట్ లో నటించడం కన్నా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీలో నటిస్తే.. తన కెరీర్ లో మరో ల్యాండ్ మార్క్ మూవీ ఉంటుందని.. పైగా తనకు ఇంకా మైలేజ్ వస్తుందని ఈ క్రేజీ మూవీలో నటిస్తుందని టాక్ వినిపిస్తోంది.

అయితే.. బన్నీ, అట్లీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో చూస్తుంటే.. దీపిక కత్తులు పట్టుకుని సాహసాలు చేస్తుంది. దీనిని బట్టి దీపిక క్యారెక్టర్ ను అట్లీ బాగా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. దీపికా గత కొంత కాలంగా ఇంత ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయలేదు. అలాగే ఫాంటసీ మూవీ కూడా చేయలేదు. ఇప్పుడు ఈ మూవీలో నటించే ఛాన్స్ రావడంతో నో చెప్పలేకపోయిందని టాక్. మరో వార్త ఏంటంటే.. ముందుగా ఈ సినిమాలో నటించేందుకు నో చెప్పిందట.. స్పిరిట్ మిస్ అవ్వడం వలనే ఈ మూవీకి ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ మూవీని నవంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని సమాచారం. అయితే.. సందీప్ పై కోపంతో ఓకే చెప్పిందా..? లేక క్యారెక్టర్ నచ్చి ఓకే చెప్పిందో తెలియదు కానీ.. ఈ బ్యూటీ కెరీర్ లో మరచిపోలేని సినిమా చేయబోతుందని మాత్రం చెప్పచ్చు అంటున్నారు సినీ జనాలు.