‘కాలం రాసిన కథలు’కు సీక్వెల్‌గా ‘బ్యాచిలర్స్ ప్రేమకథలు’ స్టార్ట్

యస్.యం. 4 ఫిలిమ్స్ బ్యానర్ పై గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ నటీ నటులుగా ఎంఎన్‌వీ సాగర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “బ్యాచిలర్స్ ప్రేమ కథలు”. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వి. సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ దర్శకులు వీర శంకర్ క్లాప్ ఇచ్చారు.

అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకనిర్మాత సాగర్ మాట్లాడుతూ.. ‘‘ఇంతకుముందు నేను తీసిన “కాలం రాసిన కథలు” సినిమాకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఉత్సాహంతో దానికి సీక్వెల్‌గా బ్యాచిలర్స్ ప్రేమ కథలు సినిమా తీస్తున్నాను. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి సోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాను. అలాగే ఇందులో కూడా నూతన నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను. ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసుకుంటున్న ఈ సినిమాను త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని 2025 లోనే విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం’’ అని అన్నారు.

నటీనటులు:
గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ తదితరులు

సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : SM4 Films
టైటిల్ : బ్యాచిలర్స్ ప్రేమ కథలు
ప్రొడ్యూసర్- రైటర్- డైరెక్టర్ :
ఎమ్ ఎన్ వి సాగర్
డి ఓ పి : ప్రసాద్ ఎస్
మ్యూజిక్ : మెరుగు అరమాన్
ఎడిటర్ : నందమూరి హరి
పి ఆర్ ఓ: మధు వి ఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం