అదిరిపోయే న్యూస్.. రజినీ మూవీలో మన టాలీవుడ్ టాప్ హీరోలు..?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ టాలీవుడ్ పై ఫోకస్ మామూలుగా పెట్టలేదు. తను ఏ సినిమా చేసినా.. అందులో టాలీవుడ్ హీరోలు ఉండేలా ప్లాన్ చేస్తుండడం విశేషం. వేట్టైయాన్ లో రానా దగ్గుబాటిని రంగంలోకి దింపితే.. కూలీలో నాగ్ ను రంగంలోకి దింపాడు. జైలర్ 2 లో బాలయ్యను దించుతున్నాడు. అయితే.. బాలయ్య, నాగ్ ఇద్దరూ రజినీ సినిమాలో ఉంటే.. ఇంకెంత క్రేజ్ ఉంటుందో కదా.. సరిగ్గా ఇదే ఆలోచన సూపర్ స్టార్ రజినీకాంత్ కు వచ్చిందట. అంతే బాలయ్య, నాగ్ ను కాంటాక్ట్ చేశారని తెలిసింది. మరి.. నాగ్ ఎస్ అంటారా నో అంటారా అనేది తెలియాల్సివుంది. అసలు రజినీ మూవీలో బాలయ్య క్యారెక్టర్ ఏంటి..? నాగ్ క్యారెక్టర్ ఏంటి..?

రజీనీకాంత్ కూలీ సినిమాలో నాగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది కీలక పాత్ర అని ప్రచారం జరగింది. ఆతర్వాత.. కీలక పాత్ర కాదు.. విలన్ క్యారెక్టర్ అని వార్తలు వస్తున్నాయి. నాగ్ క్యారెక్టర్ ఏంటి అనేది అఫిషియల్ గా ప్రకటించలేదు. ఆగష్టు 14న కూలీ భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. రజినీకాంత్ జైలర్ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రూపొందిన జైలర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో సీక్వెల్ తీయాలని ఫిక్స్ అయ్యారు. ఇటీవల జైలర్ 2 అనౌన్స్ మెంట్ వీడియోతోనే సినిమా పై అమాంతం అంచనాలు పెంచేశారు. ఇందులో నట సింహం బాలయ్య కీలక పాత్ర పోషిస్తున్నారని.. పోలీసాఫీసర్ గా కనిపించే ఈ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని టాక్ వినిపిస్తోంది.

అయితే.. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం నాగార్జునను కాంటాక్ట్ చేశారని తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని.. నాగ్ మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని సమాచారం. నాగార్జున బాలీవుడ్ లో మాంచి క్రేజ్ ఉంది. అందుచేత నాగ్ నటిస్తే.. ఆ సినిమాకి పాన్ ఇండియా రేంజ్ లో మరింతగా బజ్ క్రియేట్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో బజ్ రావాలంటే బాలీవుడ్ హీరోలతో స్పెషల్ క్యారెక్టర్ చేయించేవాళ్లు కానీ.. ఇప్పుడు బ్లాక్ బస్టర్ సాధించడం కోసం.. పాన్ ఇండియా రేంజ్ లో బజ్ కోసం టాలీవుడ్ హీరోలను రంగంలోకి దింపుతుండడం విశేషం. మరి.. జైలర్ 2 లో నటించేందుకు నాగ్ ఎస్ చెబుతారో..? నో చెబుతారో.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.