
నట సింహం నందమూరి బాలకృష్ణ వరుసగా సక్సెస్ సాధిస్తూ.. కెరీర్ లో దూసుకెళుతున్నాడు. హిట్టు మీద హిట్టు కొడుతూ.. ఆడియన్సన్ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలు, ఇంకో వైపు టాక్ షో.. ఏదైనా సరే.. దబిడి దిబిడే అన్నట్టుగా సక్సెస్ సొంతం చేసుకుంటున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. అంటూ వరుసగా సక్సెస్ సాధించిన బాలయ్య ప్రస్తుతం అఖండ 2 చేస్తున్నాడు. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కిస్తోన్న అఖండ 2 నుంచి రూటే సపరేటు అంటున్నాడట బాలయ్య. అవును.. ఇక నుంచి రూటు మారుస్తున్నాడని తెలిసింది. ఇంతకీ.. బాలయ్య ప్లాన్ ఏంటి..?
ఇప్పటి వరకు బాలయ్య తన సినిమాలను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేశారు. ఇక నుంచి పాన్ ఇండియా రేంజ్ లో తన సినిమాలను విడుదల చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. ఇప్పుడు అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలే కాదు.. మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకనే అనుకుంటా బాలయ్య కూడా అఖండ 2 సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం పక్కా ప్లానింగ్ తో షూటింగ్ జరుగుతోంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ కి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక అఖండ 2 తర్వాత బాలయ్య చేస్తోన్న మరో సినిమా ఎవరితో అంటే.. మలినేని గోపీచంద్ పేరు వినిపిస్తోంది. గతంలో బాలయ్య, మలినేని గోపీచంద్ కలిసి వీరసింహారెడ్డి అనే సినిమా చేయడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వర్కింగ్ స్టైల్ నచ్చి బాలయ్య మరో సినిమా చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యారట. ఇప్పుడు ఈ కాంబో ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజున ఈ సినిమాను అనౌన్స్ చేస్తారు. ఇందులో కూడా బాలయ్యను రెండు విభిన్న పాత్రల్లో చూపించబోతున్నారని తెలిసింది. అయితే.. ఇప్పటి వరకు బాలయ్య చేసిన క్యారెక్టర్స్ కు భిన్నంగా డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది.
అఖండ 2 అనే సినిమా డివోషనల్ టచ్ తో ఉండే కథ అనేది తెలిసిందే. ఇప్పుడు డివోషనల్ టచ్ ఉన్న సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. నార్త్ ఆడియన్స్ అయితే.. విపరీతంగా చూస్తున్నారు. హనుమాన్, కార్తికేయ 2 సినిమాలు నార్త్ ఆడియన్స్ ని ఎంతలా ఆకట్టుకున్నాయో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధించాయో చూశాం. అందుచేత అఖండ 2 నార్త్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాతో బాలయ్యకు నార్త్ లో మాంచి క్రేజ్ వస్తుంది అంటున్నారు. ఆతర్వాత మలినేని గోపీచంద్ సినిమాతో కూడా పాన్ ఇండియా మూవీగా ఆకట్టుకుంటుందని టాక్. మొత్తానికి బాలయ్య రూటు మార్చి పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి.. బాలయ్య ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.