
Balayya Creates A New Record: నట సింహం బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇలా వరుసగా నాలుగు సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఇప్పుడు అఖండ మూవీ సీక్వెల్ అఖండ 2 చేస్తున్నాడు. అయితే.. ఆ ఒక్క లోటు మాత్రం ఉండిపోయింది. నాలుగు సినిమాలు 100 కోట్ల క్లబ్ లోకి చేరినా.. ఆ రికార్డ్ మాత్రం సాధించలేకపోయాడు. ఇంతకీ.. ఆ రికార్డ్ ఏంటి..? మరి.. అఖండ 2 అయినా ఆ రికార్డ్ ను సాధించేనా..?
అఖండ సినిమాతో బాలయ్య సక్సెస్ స్టార్ట్ అయ్యింది. ఆతర్వాత వీరసింహారెడ్డి అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు కూడా అంచనాలకు తగ్గట్టుగా బ్లాక్ బస్టర్స్ సాధించాయి. అయితే.. ఎన్ని బ్లాక్ బస్టర్స్ సాధించినా.. 100 కోట్ల షేర్ మాత్రం సాధించలేకపోయాడు. వీరసింహారెడ్డి గ్రాస్ 150 కోట్లుకు చేరినా.. షేర్ మాత్రం 80 కోట్లే. భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలు కూడా అంతే.. గ్రాస్ 100 కోట్లు దాటినా షేర్ మాత్రం 100 కోట్లకు చేరుకోలేకపోయింది. దీంతో బాలయ్య సినిమా 100 కోట్ల షేర్ అనేది కలగానే మిగిలిపోయింది.
అఖండ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమా షేర్ ఖచ్చితంగా 100 కోట్లు క్రాస్ చేస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకుంటే.. 75 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడంతో అభిమానులకు నిరాశే ఎదురైంది. భగవంత్ కేసరి కూడా టాక్ బాగానే వచ్చింది. షేర్ 100 కోట్లు రావడం ఖాయం అనుకున్నారు కానీ.. జరగలేదు. డాకు మహారాజ్ 82 కోట్లు షేర్ వచ్చింది. దీంతో 100 కోట్ల షేర్ అనేది బాలయ్య అభిమానులకు అందని ద్రాక్షలా మారింది. ఇదిలా ఉంటే.. 100 కోట్ల షేర్ లేని బాలయ్య అఖండ 2 విషయంలో బిజినెస్ పరంగా 100 కోట్లకు చేరుకున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. Balayya creates a new record with Akhanda 2 business over 120cr.
సింహా, లెజెండ్, అఖండ.. ఇలా బాలయ్య, బోయపాటి కాంబోలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో అఖండ 2 పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఉన్నాయి. అఖండ 2 గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో థియేట్రికల్ రైట్స్ 100 కోట్లు దాటేసిందని టాక్. ఈసారి బాలయ్య, బోయపాటి కలిసి చేసిన అఖండ 2 ను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తుండడంతో అన్ని భాషల్లో కలిపి 120 కోట్లకు అమ్ముతున్నారట. ఇప్పటి వరకు బాలయ్య సినిమాలకు 90 కోట్ల వరకు బిజినెస్ జరిగేది. ఇప్పుడు 120 కోట్ల బిజినెస్ జరిగింది. బాలయ్య, బోయపాటి కాంబోకి మంచి క్రేజ్ ఉంది. అందుచేత మంచి టాక్ వస్తే.. 100 కోట్లు దాటడం అంత కష్టమేమీ కాదు. మరి.. ఏం జరగనుందో చూడాలి.