సంచలన దర్శకుడితో బాలయ్య సినిమా ఫిక్స్.!

నట సింహం నందమూరి బాలకృష్ణ స్పీడు మామూలుగా లేదు. అఖండ సినిమా దగ్గర నుంచి వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం అఖండ సినిమాకి సీక్వెల్ అఖండ 2 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రెండు మూడు ప్రాజెక్టులు డిష్కసన్ స్టేజ్ లో ఉన్నట్టుగా టాక్ వినిపించింది. ఇప్పుడు కొత్తగా సంచలన దర్శకుడితో బాలయ్య సినిమా ఓకే అయ్యిందని తెలిసింది. ఇంతకీ.. ఆ సంచలన దర్శకుడు ఎవరు..? ప్రచారంలో ఉన్న ఈ వార్తలో నిజమెంత..?

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇలా వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ సాధించిన బాలయ్య ఇప్పుడు అఖండ 2 మరో బ్లాక్ బస్టర్ సాధించేందుకు రెడీ అవుతున్నాడు. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ఈ సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి బాలయ్య, బోయపాటి కలిసి పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే బోయపాటి థ్రిల్ కలిగించేలా అఖండ 2 కథను రాసారట. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది అంటున్నారు.

అఖండ 2 తర్వాత మలినేని గోపీచంద్ తో సినిమా చేయనున్నాడు బాలయ్య. వీరిద్దరి కాంబోలో వీరసింహారెడ్డి అనే సినిమా రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ కాంబో మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలోనే సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా ఓ మూవీ చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ తో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత బాలయ్యతో సినిమా చేయడం ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే.. మార్కో మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి మలయాళ ఇండస్ట్రీలోనే కాదు.. పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ అనీఫ్ అదేని. ఈ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫిక్స్ అవ్వడం.. ఆ మధ్య ఈ సినిమాను అనౌన్స్ చేయడం తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో హీరో ఎవరు అనేది ప్రకటించలేదు. ఇప్పుడు బాలయ్య పేరు వినిపిస్తోంది. దిల్ రాజు ఎప్పటి నుంచో బాలయ్యతో సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ కాంబో ఫిక్స్ అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ కాంబో ఫిక్స్ అవుతుందో లేదో చూడాలి.