
Bhagyasree Replaces Sreeleela in Lenin: ఒకరి కోసం కథ రాస్తే.. వేరొకరితో సెట్ అయినట్టుగా.. ఒక హీరోయిన్ ని తీసుకున్న తర్వాత అదే ప్లేస్ లో మరో హీరోయిన్ ని తీసుకోవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఇప్పుడు శ్రీలీల ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నారని తెలిసింది. ఇంతకీ.. ఏ సినిమా కోసం అంటారా..? అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా కోసం. ఇంతకీ.. శ్రీలీలను తప్పించారా..? తప్పుకుందా..? అసలు ఏం జరిగింది..? భాగ్యశ్రీని తీసుకోవడం వలన అఖిల్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి..?
లెనిన్ మూవీ నుంచి శ్రీలీల తప్పుకుందా..? తప్పించారా..? అంటే.. మేకర్సే తప్పించారని తెలిసింది. కారణం ఏంటంటే.. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి టాలీవుడ్ సినిమాలకు డేట్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతుందట శ్రీలీల. అందుకనే.. ఈ ప్రాజెక్ట్ నుంచి మేకర్సే తప్పించారని తెలిసింది. ఈ వార్త లీక్ అవ్వడంతో ఇక ఆలస్యం చేయకుండా వేరే హీరోయిన్ ని ఫిక్స్ చేశారని తెలిసింది. ఆమె ఎవరో కాదు.. భాగ్యశ్రీ బోర్సే. మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అయితే.. ఈ మూవీ రిలీజ్ కాకుండానే.. రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. Bhagyasree Replaces Sreeleela in Lenin.
ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమాలో భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి దర్శకుడు మహేష్ ఈ మూవీకి డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇందులో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు భాగ్యశ్రీ నటిస్తోన్న మరో సినిమా కింగ్ డమ్. ఇందులో విజయ్ దేవరకొండ హీరో.. గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
లెనిన్ మూవీ కోసం భాగ్యశ్రీని తీసుకోవడం గురించి అఖిల్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే.. శ్రీలీల తప్పించి మంచి పని చేశారని.. భాగ్యశ్రీ అయితే బాగుంటుందని అఖిల్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లెనిన్ వచ్చేసరికి ఆంధ్రా కింగ్ తాలూకా, కింగ్ డమ్ సినిమాలు రిలీజ్ అయి వుంటాయి. ఆమెను తీసుకోవడం మంచి ఛాయిస్ అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాని సాధ్యమైనంత ఫాస్ట్ గా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. అందుకనే శ్రీలీల తప్పించి భాగ్యశ్రీని తీసుకున్నారు. త్వరలోనే భాగ్యశ్రీని అఫిషియల్ గా అనౌన్స్ చేయడంతో పాటు రిలీజ్ పై కూడా క్లారిటీ ఇస్తారని సమాచారం.