
Bigg Boss Season 9: బిగ్ బాస్ ఓ సంచలనం. ఈ రియాల్టీ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి సీజన్ లో అద్భుతాలు చేసింది. ఫస్ట్ సీజన్ నుంచి ఎనిమిదోవ సీజన్ వరకు టీఆర్పీ రేటింగ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు త్వరలో బిగ్ బాస్ 9వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. దీనికి హోస్ట్ గా బాలయ్య అంటూ ప్రచారం జరిగింది కానీ.. నాగార్జునే హోస్ట్ గా రాబోతున్నారు. అయితే.. ఈసారి బిగ్ బాస్ 9 సీజన్ ను కొత్తగా ప్లాన్ చేశారని.. ఈ ప్లాన్ అదిరిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. బిగ్ బాస్ 9 ప్లాన్ ఏంటి..?
బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా, సెకండ్ సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశారు. ఇక మూడో సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్ గా చేస్తున్నారు. సీజన్ సీజన్ కు టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటూ ఈ బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే.. ఎనిమిదవ సీజన్ కు బాగానే టీఆర్పీ రేటింగ్ వచ్చింది కానీ.. షో డిజైన్ చేసిన విధానం సరిగా లేదని.. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ సరైన వాళ్లను తీసుకోలేదని ఇలా కొన్ని విమర్శలు వచ్చాయి. అందుకనే ఈ విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సరికొత్తగా ప్లాన్ చేశారట బిగ్ బాస్ మేకర్స్. Bigg Boss Season 9.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఈసారి రూటు మార్చి సెలబ్రిటీలతో పాటు కామన్ మేన్స్ ను కూడా భాగం చేసే విధంగా ప్లాన్ చేశారని సమాచారం. దీనికి ఏం చేయాలంటే.. ఈ సంస్థ చెప్పిన వెబ్ సైట్ లో బిగ్ బాస్ 9లో ఎందుకు పాల్గొనాలి అనుకుంటున్నారో చెబుతూ ఒక వీడియో చేసి స్టార్ మా కు పంపించాలి. అలా పంపించిన వీడియోల్లో బెస్ట్ అనిపించిన వాళ్లను ఆడిషన్స్ కు పిలుస్తారు. అక్కడ కనుక పాసైతే.. డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. ఇదేదో బాగానే ఉంది. దీంతో కామన్ ఆడియన్స్ తో కనెక్షన్ పెరుగుతుంది. సోషల్ మీడియా సెలబ్రిటీలను కాకుండా ఇలా కామన్ మేన్స్ ను తీసుకోవాలి అనుకోవడం మంచి నిర్ణయమే.
బిగ్ బాస్ 9 కు సంబంధించి ప్రొమో స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు కొత్త సీజన్ స్టార్ట్ చేస్తారో అఫిసియల్ గా అనౌన్స్ చేయలేదు. దసరా నుంచి స్టార్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే.. దసరాకి స్టార్ట్ చేయడం కోసం ఇప్పటి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయరు అని టాక్. అందుచేత దసరా కంటే ముందే బిగ్ బాస్ 9 స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇటీవల నాగార్జున కుబేర సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫామ్ లోకి వచ్చారు. నెక్ట్స్ 100 సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. ఆగష్టు 14న కూలీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే బిగ్ బాస్ 9తో అందర్నీ పలకరించడానికి రెడీ అవుతున్నారు. మరి.. ఈసారి బిగ్ బాస్ 9 ఎలాంటి వివాదాలు.. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.