
నట సింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వీరిద్దరి మధ్య సినిమాల పరంగానూ, రాజకీయాల్లోనూ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే.. వీరిద్దరూ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతుండడం అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. బాలయ్య, పవన్ కళ్యాణ్ పోటీపడుతున్నారా..? ఇంతకీ ఏ సినిమాలతో..? అసలు ఇది నిజమేనా..? లేక గాసిప్పా..? అనుకుంటున్నారా..? క్లారిటీ రావాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
బాలయ్య, బోయపాటి కాంబోలో రూపొందుతోన్న భారీ, క్రేజీ మూవీ అఖండ 2. సింహా, లెజెండ్, అఖండ.. ఇలా వీరిద్దరూ కలిసి చేసిన మూడు సినిమాలు ఒకదానిని మించి మరోటి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో నాలుగవ సినిమా అఖండ 2 పై ఎక్స్ పెక్టేషన్స్ హై లెవల్లో ఉన్నాయి. ప్రస్తుతం జార్జియాలో బాలయ్య పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈసారి బాలయ్య, బోయపాటి కలిసి పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయాలి అనకుంటున్నారు. అందుకనే.. అఖండ 2 మూవీని పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న క్రేజీ మూవీ ఓజీ. దీనికి సుజిత్ డైరెక్టర్. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తుండడంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీని థియేటర్లో చూస్తామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల మూవీ సెట్ లో పవర్ స్టార్ జాయిన్ అయ్యారు. అయితే.. ఈ సినిమా సంక్రాంతికి వస్తుందేమో అని ప్రచారం జరిగింది కానీ.. ఇప్పుడు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్స్ లోకి రానుందని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. అదే టేడ్ కి బాలయ్య అఖండ 2 వస్తుందని ఎప్పుడో ప్రకటించారు. దీంతో బాలయ్య అఖండ 2, పవర్ స్టార్ ఓజీ సెప్టెంబర్ 25న బాక్సాఫీస్ దగ్గర పోటీపడనున్నాయని టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే.. అఖండ 2 సెప్టెంబర్ 25న వస్తుందా..? లేక సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యిందా..? నిజంగానే అఖండ 2, ఓజీ పోటీపడనున్నాయా..? అనేది తెలియాల్సివుంది.