బోయపాటి నెక్ట్స్ మూవీ హీరో ఎవరంటే..?

BoyapatiSrinu Chiranjeevi Movie Update
BoyapatiSrinu Next Movie With Chiranjeevi Latest Update.!

BoyapatiSrinu Chiranjeevi Movie Update: ఊర మాస్ డైరెక్టర్ అంటే.. ఠక్కున గుర్తొచ్చేది బోయపాటి శ్రీను. కెరీర్ ప్రారంభం నుంచి మాస్ ఆడియన్స్ ని తన సినిమాలతో విశేషంగా ఆకట్టుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. మాస్ సినిమాలు చేసినా.. తన సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా బలమైన ఎమోషన్స్ సీన్స్ తో కట్టిపడేస్తుంటారు. అందుకనే బోయపాటి సినిమాలు మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చుతాయి. ఇదిలా ఉంటే.. బాలయ్యతో బోయపాటి అఖండ 2 చేస్తున్న విషయం తెలిసిందే. మరి.. అఖండ 2 తర్వాత బోయపాటి సినిమా ఎవరితో..?

బోయపాటి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాని ప్లాన్ చేశారు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్. ప్లాన్ చేయడమే కాదు.. ఒకానొక సందర్భంగా ఈ క్రేజీ కాంబో మూవీని ప్రకటించడం కూడా జరిగింది. ఖైదీ నెంబర్ 150 తర్వాత నుంచి ఈ క్రేజీ కాంబో మూవీ గురించి వార్తలు రావడం.. టాలీవుడ్ లోనూ, సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతుంది కానీ.. ఇంత వరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. చిరు ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పక్కా ప్లానింగ్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు మెగాస్టార్.

అయితే.. అఖండ 2 తర్వాత బోయపాటి ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ప్రకటించలేదు కానీ.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆమధ్య బాలయ్య ఫంక్షన్ లో పాల్గొన్న చిరంజీవి.. మంచి కథ రెడీ చేస్తే.. బాలయ్యతో కలిసి నటించడానికి రెడీ అంటూ మెగాస్టార్ చెప్పడం.. కథ రెడీ చేయమని బోయపాటికి ఆఫర్ ఇవ్వడం తెలిసిందే. అయితే.. ఇప్పుడు చిరు, బాలయ్య కలిసి నటించేలా కథ రెడీ చేయలేదు కానీ.. చిరంజీవితో సినిమా చేయడం కోసం బోయపాటి స్టోరీ రెడీ చేశారని ప్రచారం జరుగుతోంది.

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి స్పీడు మరింతగా పెంచి కెరీర్ లో దూసుకెళుతున్నాడు. ఒకానొక టైమ్ లో నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకువచ్చి యంగ్ హీరోలకు సైతం షాక్ ఇచ్చారు.. సర్ ఫ్రైజ్ చేశారు. ఇప్పుడు విశ్వంభర రిలీజ్ కాకుండానే.. అనిల్ రావిపూడితో సినిమాను స్టార్ట్ చేయడం.. మరో సినిమాను శ్రీకాంత్ ఓదెలతో చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే.. బోయపాటి కథతో మెప్పించినా.. ఈ ప్రాజెక్ట్ ఓకే అయినా.. పట్టాలెక్కడానికి కాస్త టైమ్ పడుతుంది. మరి.. బోయపాటి నెక్ట్స్ మూవీని ప్రచారంలో ఉన్నట్టుగా మెగాస్టార్ తోనే చేస్తాడో లేక వేరే హీరోతో చేస్తాడో చూడాలి.

BoyapatiSrinu Chiranjeevi Movie Update..!

https://www.mega9tv.com/cinema/megastar-chiranjeevis-vishwambhara-movie-release-date/