పూరి, బుచ్చిబాబు ల భేటీ వెనక ఇంత కథ ఉందా..?

Buchibabu And Puri Jagannath: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు.. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. పూరి అంటే.. బుచ్చిబాబుకు ఎంతో ఇష్టం. బుచ్చి అంటే పూరికి కూడా అంతే.. ఇష్టం. అయితే.. ఇప్పుడు పూరి తన సినిమా బిజీలో తనుంటే.. బుచ్చిబాబు తన సినిమా వర్క్ బిజీలో తను ఉన్నాడు. ఇదిలా ఉంటే.. పూరిని కలిసాడు బుచ్చిబాబు. అంతే కాకుండా ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది తెగ వైరల్ అయ్యింది. ఈ ఫోటోతో పాటు పూరి గురించి.. తన గురించి ఆసక్తికర విషయాల్ని బయటపెట్టాడు బుచ్చిబాబు. ఇంతకీ.. బుచ్చిబాబు ఏం చెప్పాడు..?

పూరి జగన్నాథ్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ మూవీని డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అదే చిరుత. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ సాధించింది. పూరి చరణ్‌ ఫస్ట్ మూవీని డైరెక్ట్ చేస్తే.. బుచ్చిబాబు తన రెండో సినిమాని చరణ్‌ తో చేస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే.. పూరి గురించి తన గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టాడు బుచ్చిబాబు. అదేంటంటే.. పూరి, తను ఇద్దరం ఒకే ఊళ్లో పుట్టాము. అదే పిఠాపురం. మా ఇద్దరు తల్లులకు డెలివరీ అయ్యింది సీఎంసీ హాస్పటల్ లోనే. మేమిద్దరం ఇప్పుడు డైరెక్షన్ అనే ఒకే మార్గంలో ప్రయాణిస్తున్నాం. ఇది అంతా దేవుడి రాత. నాకు బాగా ఇష్టమైన మనుషుల్లో ఒకరు పూరి సార్ అని పోస్ట్ పెట్టాడు బుచ్చిబాబు.

బుచ్చిబాబు పెట్టిన పోస్ట్ చూసి నెటిజన్లు సర్ ఫ్రైజ్ గా ఫీలవుతున్నారు. మీరిద్దరూ ఒకే ఊరులో.. ఒకే హాస్పటల్ లో పుట్టారా..? అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం వీరు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. బుచ్చిబాబు రామ్ చరణ్ తో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇందులో చరణ్‌ కు జంటగా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమాను మార్చి 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. Buchibabu And Puri Jagannath.

ఇక పూరి జగన్నాథ్ విషయానికి వస్తే.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కథ ఇప్పటి వరకు రాని విధంగా చాలా కొత్తగా ఉండబోతుందని తెలిసింది. హైదరాబాద్, ముంబాయి, చెన్నైలో ఈ సినిమాని షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్ వేసారని సమాచారం. ఇటీవల విజయేంద్రప్రసాద్ ను కలిసి ఈ కథ గురించి డిష్కస్ చేశారని వార్తలు రావడం మరింత ఆసక్తిగా మారింది. ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. పూరి బెగ్గర్, బుచ్చిబాబు పెద్ది కూడా నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరి.. ఈ ఇద్దరు దర్శకులు తమ సినిమాలతో ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/manchu-vishnu-and-puri-jagannath-controversy-on-assembly-rowdy-remake/