దర్శకధీరుడుతో బన్నీ సినిమా నిజమా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప, పుష్ప 2 సినిమాలతో ఎంతటి సంచలనం సృష్టించాడో తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బన్నీ రేంజే మారిపోయింది. తన క్రేజ్ రేంజ్ కి తగ్గట్టుగా ఇప్పుడు కోలీవుడ్ స్టార్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలి కానీ.. బన్నీ ప్లానింగ్ వేరేలా ఉందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ లీక్. ఇంతకీ.. బన్నీ ప్లాన్ ఏంటి..? అట్లీ తర్వాత బన్నీ సినిమా ఎవరితో..?

పుష్ప 2 సినిమా దాదాపు 2000 కోట్లు కలెక్ట్ చేయడంతో.. బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు అక్కడ అమీర్ ఖాన్ తో సమానమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆల్రెడీ ఆ స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు చరణ్‌, ఎన్టీఆర్ కూడా అదే టార్గెట్ తో అడుగులు వేస్తున్నారు. అయితే.. తనకు వచ్చిన క్రేజ్ కు తగ్గట్టుగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న బన్నీ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాలి కానీ.. తెలివిగా అట్లీతో సినిమాను ఓకే చేశాడు. అట్లీ షారుఖ్ తో తీసిన జవాన్ 1400 కోట్లు కలెక్ట్ చేసింది. తన క్రేజ్ కు అట్లీ కూడా తోడైతే ఈ సినిమా 2000 కోట్లకు మించిన సక్సెస్ సాధిస్తుంది అనేది బన్నీ ఆలోచన.

ఇక అసలు విషయానికి వస్తే.. అట్లీ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాలి కానీ.. ఆతర్వాత అంతకు మించి అనేలా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకనే దర్శకధీరుడు రాజమౌళి రంగంలోకి దింపాలి అనుకుంటున్నాడట. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్‌ బాబుతో గ్లోబల్ రేంజ్ మూవీ తీస్తున్నారు. ఈ సినిమా వసూళ్ల టార్గెట్ 2000 కోట్ల పైగానే ఉంది. గత కొంతకాలంగా బన్నీ, రాజమౌళి మూవీ గురించి ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ను అల్లు అరవింద్ ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే.. మహేష్‌ మూవీ తర్వాత జక్కన్న బన్నీతో సినిమా చేస్తే.. చరిత్ర సృష్టించడం ఖాయం.