బన్నీ వాసు మాట.. బన్నీ వింటాడా..?

బన్నీకి అత్యంత సన్నిహితుడు వాసు. వీరిద్దరి మధ్య స్నేహం గురించి తెలిసిందే. ఆ స్నేహం కారణంగానే.. వాసు కాస్త బన్నీ వాసు అయ్యాడు. గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడం ప్రారంభించి ఇప్పుడు బన్నీ వాసుగా.. డిస్ట్రిబ్యూటర్ గా, ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నాడు. అయితే.. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి హీరోలు మారాలని.. సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఒక సినిమా చేయడం కాదు కరెక్ట్ కాదని బన్నీ వాసు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అది ఇలా పెట్టాడో లేదో అలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే.. బన్నీ వాసు పెట్టిన పోస్ట్ బాగానే ఉంది. మరి.. బన్నీ వాసు చెప్పిన మాట.. బన్నీ వింటాడా..?

బన్నీ వాసు ఇంతకీ ఏమని పోస్ట్ పెట్టాడంటే.. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని. ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్పా.. ఇలా సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి.

మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్సే ఉంటే.. పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది. ఇది నిర్మాత బన్నీ వాసు పెట్టిన పోస్ట్. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అయితే.. బన్నీ వాసు పెట్టిన ఈ పోస్ట్ అక్షర సత్యం. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ చాలా వరకు మూతపడ్డాయి. ఇప్పుడు ఓటీటీ వలన జనాలు థియేటర్స్ కు రావడం లేదు. భారీ సినిమా.. బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తేనే థియేటర్స్ లో చూద్దామనే ఆలోచనలో ఉన్నారు జనాలు. అయితే.. బన్నీ వాసు పెట్టిన తర్వాత మీ మాట బన్నీ వింటాడా..? ఆయనతో సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒక సినిమా కాకుండా ఎక్కువ సినిమాలు చేయించగలవా..? మెగాస్టార్ సంవత్సరానికి ఒక సినిమా కాకుండా రెండు సినిమాలు చేయగలరా..? వీళ్లనే కాదు.. స్టార్ హీరోలు అందరూ సంవత్సరానికి ఎక్కువ సినిమాలు చేయగలరా అనే మాట వినిపిస్తుంది. చెప్పడం సులువే.. చేయడం కష్టం. ముందు బన్నీతో సంవత్సరానికి ఒకటి కాదు రెండు సినిమాలు చేయించి.. ఆతర్వాత మిగిలిన హీరోలు కూడా ఇలా చేయాలని చెబితే బాగుంటుందనే మాట వినిపిస్తోంది. మరి.. బన్నీ వాసు చెప్పినట్టుగా ఏ ఏ హీరోలు వింటారా..? ఎక్కువ సినిమాలు చేస్తారో చూడాలి.