చైతూ 25వ సినిమా ప్లాన్ మారిందా..?

Chaitu 25th Film Update: అక్కినేని నాగచైతన్య ఇటీవల తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. తండేల్ 23వ సినిమా కాగా.. నెక్ట్స్ కార్తీక్ దండుతో 24వ సినిమాను చేస్తున్నాడు. ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం గుజరాత్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. చైతూ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచే 25వ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చైతూ 25వ సినిమా విషయంలో ప్లాన్ మారిందని ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ.. చైతూ ఏం ప్లాన్ చేశాడు..? మారిన ప్లాన్ ఏంటి..?

నాగచైతన్య హీరోగా కొత్త దర్శకుడితో ఓ సినిమా ప్లానింగ్ జరుగుతుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాను బాహుబలి ప్రొడ్యూసర్స్ నిర్మించనున్నారని టాక్ వినిపించింది. ఇది హర్రర్ జోనర్ లో రూపొందే సినిమా అని.. ఈ సినిమా చైతూ కెరీర్ లో 25వ చిత్రం అంటూ ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు చైతూ హర్రర్ జోనర్ లో సినిమా చేయలేదు. అయితే.. కథ నచ్చడంతో ఓకే చెప్పాడని టాక్ వినిపించింది. త్వరలోనే ఈ క్రేజీ మూవీకి సంబంధించి అనౌన్స్ మెంట్ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తుంటే.. ఇప్పుడు ప్లాన్ మారిందనే కొత్త వార్త బయటకు వచ్చింది.

మేటర్ ఏంటంటే.. చైతూ 25 సినిమా కోసం డైరెక్టర్ శివ నిర్వాణ కథ రెడీ చేశాడట. ఇటీవల కథ చెప్పిన శివ నిర్వాణకు ఓకే చెప్పాడని తెలిసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ హీరో చైతూకు, డైరెక్టర్ శివ నిర్వాణకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని సమాచారం. గతంలో చైతూ, శివ నిర్వాణ కలిసి మజిలీ అనే సినిమా చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. సక్సెస్ తో పాటు ఈ సినిమాకి చైతూకు మంచి పేరు కూడా తీసుకువచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో మూవీ అంటే మరింతగా క్రేజ్ పెరగడం ఖాయం. Chaitu 25th Film Update.

మజిలీలో చైతూతో ప్రేమకథ చెప్పిన శివ నిర్వాణ.. ఈసారి యాక్షన్ స్టోరీ చూపించబోతున్నాడని.. ఇది హీరో చైతన్యకు, డైరెక్టర్ శివ నిర్వాణకు ఇద్దరికీ కొత్తగా ఉంటుంది. ఈ మూవీ స్ర్కిప్ట్ రెడీ అయ్యింది. ఇటీవల ఫుల్ నెరేషన్ ఇవ్వగా ఓకే చెప్పాడట. దీంతో శివ నిర్వాణ ప్రస్తుతం డైలాగ్ వెర్షెన్ రాస్తున్నాడని తెలిసింది. స్క్రిప్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మంచి ముహుర్తం చూసుకుని ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. మరి.. మజిలీతో బ్లాక్ బస్టర్ సాధించిన చైతూ, శివ నిర్వాణ ఈసారి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/vishnu-said-that-there-is-a-whatsapp-group-for-tollywood-star-heroes-but-why-did-he-left/