
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా.. క్రిష్, జ్యోతికృష్ణ తెరకెక్కించిన సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమాకి నిర్మాత ఏఎం రత్నం. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని జూన్ 12న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. వీరమల్లు కథ మారిందని.. కథలో భారీగా మార్పులు చేర్పులు చేశారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ముందగా క్రిష్ స్టార్ట్ చేసినప్పుడు కథ ఏంటి..? కొత్తగా చేసిన మార్పులు ఏంటి..? అసలు ఈ మార్పులు చేయడానికి కారణం ఏంటి..?
మొగలు సామ్రాజ్యం కాలంలో.. ఒక దొంగ కథగా వీరమల్లు కథను రెడీ చేశారు క్రిష్. ఈ దొంగ కోహినూర్ వజ్రాన్ని కొల్లగొట్టడం.. తను దోచుకున్న ధనాన్ని పేదలకు పంచి పెట్టడం అనే పాయింట్ తో ఈ కథను రాసుకున్నారు. అలాగే కథానాయకుడుగా ఊహించని ప్లాష్ బ్యాక్ ఉంటుందని.. అది అందర్నీ కదిలించేలా.. ఆలోచించేలా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే.. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం.. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో డైరెక్టర్ క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆతర్వాత నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకోవడం తెలిసిందే.
ఇటీవల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పరిరక్షణ అంటూ దేవాలయాలను దర్శించారు. అయితే.. వీరమల్లు కథలో సనాతన ధర్మం పరిరక్షణ అనే పాయింట్ కీలకంగా ఉండేలా మార్పులు చేర్పులు చేశారని టాక్ వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. క్రిష్ కథలోని పాత్రలు తీసుకుని.. కథను మార్చారని వార్తలు వస్తున్నాయి. క్రిష్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ – సనాతన ధర్మం అనే పాయింట్ డిష్కసన్స్ లో లేదు. ఆతర్వాత జరిగిన పరిణామాల వలన పవన్ సనాతన ధర్మం అనే రాగం అందుకోవడంతో ఈ సినిమా కథను ఆ పాయింట్ చుట్టూ తిరిగేలా చేశారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. ప్రచారంలో ఉన్నది నిజమేనా..? కాదా..? అసలు వీరమల్లు కథ ఏంటి అనేది క్లారిటీ రావాలంటే జూన్ 12 వరకు ఆగాల్సిందే.