
ఒక హీరో కోసం కథ రాస్తే.. మరో హీరోతో సెట్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో జరుగుతుంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు.. ఎప్పటి నుంచో ఇలా జరుగుతూనే ఉంది. తాజాగా చరణ్ నో చెబితే.. విజయ్ ఓకే చెప్పాడని ఓ కొత్త వార్త బయటకు వచ్చింది. ఆమధ్య ఓ ప్రాజెక్ట్ విషయంలో అలాగే జరిగింది. ఇప్పుడు మరోసారి చరణ్ నో చెప్పడం.. విజయ్ ఎస్ చెప్పడం జరిగిందని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ.. కథ రాసిన డైరెక్టర్ ఎవరు..? ఈ ప్రాజెక్ట్ వెనుక అసలు ఏం జరిగింది..?
హాయ్ నాన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమైన టాలెంటెడ్ డైరెక్టర్ శౌర్యువ్. నాని హీరోగా నటించిన హాయ్ నాన్న క్లాస్ మూవీగా రూపొందింది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షనే రాబట్టింది. ఆతర్వాత నెక్ట్స్ శౌర్యవ్ ఎన్టీఆర్ కోసం కథ రాసాడని.. కథ విని ఎన్టీఆర్ ఓకే చెప్పాడని ప్రచారం జరిగింది. ప్రచారంలో ఉన్న వార్తల పై శౌర్యువ్ క్లారిటీ ఇచ్చాడు. అలాంటిది ఏమీ లేదని.. అయితే.. ఎన్టీఆర్ తో సినిమా చేయాలనివుంది. అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను.. అవకాశం వస్తే మాత్రం వదులుకోను అంటూ తన మనసులో మాటలను బయటపెట్టాడు.
ఆతర్వాత శౌర్యువ్ చరణ్ కోసం కథ రాసాడట. చరణ్ ను కలిసి కథ చెప్పడం కూడా జరిగిందట. అయితే.. ఇప్పుడు తను చేస్తున్న సినిమాలను బట్టి ఆ కథతో చేయడం కరెక్ట్ కాదనుకున్నాడో ఏమో కానీ.. సున్నితంగా నో చెప్పాడని ఇండస్ట్రీలో వినిపించింది. అయితే.. ఇప్పుడు ఇదే కథను విజయ్ దేవరకొండకు చెప్పడం.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని ప్రచారం జరుగుతుంది. గతంలో గౌతమ్ తిన్ననూరి.. చరణ్ కి కథ చెబితే నో చెప్పాడు. అదే కథను విజయ్ కు చెబితే ఓకే చెప్పాడు. అదే.. కింగ్ డమ్. ఇప్పుడు కూడా చరణ్ నో చెప్పిన కథకు విజయ్ ఎస్ చెప్పాడని టాక్ అయితే స్ప్రేడ్ అవుతోంది. రౌడీ జనార్థన్, మైత్రీ మూవీ మేకర్స్ సినిమాల తర్వాత విజయ్, శౌర్యువ్ సినిమా ఉంటుందని టాక్. మరి.. ప్రచారంలో ఉన్నది నిజమౌతుందో లేదో చూడాలి.