
Megastar OTT Entry: ఇప్పుడు ట్రెండ్ మారింది.. థియేటర్స్ లో సినిమా చూడడం కన్నా.. ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. అందుకనే.. సినీ స్టార్స్ కూడా ఓటీటీలో వెబ్ సిరీస్ లు, సినిమాలు చేయడానికి ఓకే చెబుతున్నారు. సీనియర్ హీరోల్లో ఒక్క మెగాస్టార్ తప్పా.. మిగిలిన ముగ్గురు బాలయ్య, నాగ్, వెంకీ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ కూడా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ.. బాలయ్య, నాగ్, వెంకీ ఓటీటీ ఎంట్రీ ఏంటి..? చిరు ప్లాన్ ఏంటి..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే..
కొత్తగా ట్రై చేయడంలో ఎప్పుడూ ముందుండే హీరో కింగ్ నాగార్జున. అందుకనే నాగార్జునను ట్రెండ్ సెట్టర్ అంటారు. మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చారు. ఆతర్వాత బిగ్ బాస్ అంటూ బుల్లితెర పై సంచలనం సృష్టించారు. ఓటీటీ కోసమని స్పెషల్ బిగ్ బాస్ షో చేశారు. ఈ విధంగా బిగ్ బాస్ షోతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ఇక బాలయ్య విషయానికి వస్తే.. అన్ స్టాపబుల్ అంటూ ఆహా కోసం టాక్ షో చేశారు. బాలయ్య టాక్ షో చేస్తున్నారు అనగానే.. ఎలా ఉంటుందో..? షోను ఎలా హ్యాండిల్ చేస్తారో అనుకున్నారు కానీ.. అంచనాలకు మించి అన్ స్టాపబుల్ టాక్ షోను సక్సెస్ చేశారు బాలయ్య.
ఇక విక్టరీ వెంకటేష్ రానా నాయుడు అంటూ నెట్ ఫ్లిక్స్ కోసం వెబ్ సిరీస్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో రానాతో కలిసి వెంకీ నటించారు. ఫస్ట్ సీజన్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో సెకండ్ సీజన్ చాలా కేర్ తీసుకున్నారు. ఇలా.. వెంకీ రానా నాయుడు వెబ్ సిరీస్ తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చాడు. ఇక మిగిలింది మెగాస్టార్ చిరంజీవి. గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇంత వరకు చిరు ఓటీటీ కోసం సినిమా కానీ.. టాక్ షో కానీ చేయలేదు.
అయితే.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కుబేర సక్సెస్ మీట్ లో గెస్ట్ గా ఫాల్గొన్నారు. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. నాగార్జున కుబేర సినిమాలో దీపక్ అనే క్యారెక్టర్ ను అద్భుతంగా పోషించాడని మెచ్చుకున్నారు. అంతే కాకుండా.. ఇక నుంచి తను కూడా నాగ్ రూటులో నడుస్తానని.. Megastar OTT Entry ఓ వెబ్ సిరీస్ కానీ.. ఓటీటీ కోసం చేసే సినిమాలో కానీ నటిస్తానని.. ఇక నుంచి క్యారెక్టర్స్ చేయడానికి రెడీ అంటూ అనౌన్స్ చేశారు మెగాస్టార్. ఇక మెగాస్టారే స్వయంగా ఓటీటీ కోసం ఏదైనా చేస్తానని ప్రకటించడంతో త్వరలోనే అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆహా ఓటీటీ కోసం చిరుతో ఏదైనా చేయించాలని అల్లు అరవింద్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. అలాగే మరి కొన్ని ఓటీటీ సంస్థలు కూడా చిరును కాంటాక్ట్ చేశాయని సమాచారం. మరి.. మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.