షాకింగ్ న్యూస్…కూలీ టైటిల్ మార్చేశారు…ఎందుకంటే..?

Coolie Title Changed in Hindi: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కొత్త సినిమా కూలీ. ఈ సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించడంతో తెలుగు రాష్ట్రాల్లో కూలీ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ తో థియేట్రికల్ రైట్స్ కోసం పోటీపడ్డారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మారిందనే న్యూస్ వైరల్ అయ్యింది. కూలీ అని ఎప్పుడో అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు టైటిల్ మారడం ఏంటి..? అసలు ఇది నిజమేనా..? ఏం జరిగింది..? రీసెంట్ గా రిలీజ్ చేసిన కూలీ సాంగ్ ఎలా ఉంది.. వీటన్నింటి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా..?

కూలీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. చిక్కిటు అంటూ స్టార్ట్ అయ్యే ఈ సాంగ్ కు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందించారు. తమిళంలో ఈ పాటను టి.రాజేందర్ పాడారు. డాన్స్ మాస్టర్ శాండీ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట లిరికల్ వీడియోలో అనిరుధ్, టి.రాజేందర్ డ్యాన్స్ తో అదరగొట్టారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది. కూలీ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. అన్ని భాషల్లోనూ కూలీ పేరుతోనే సినిమా విడుదలవుతుందని ప్రకటించారు కానీ ఒక్క భాషలో మాత్రం ఈ సినిమా టైటిల్ మార్చబోతున్నారు.

అవును.. కూలీ టైటిల్ ను హిందీలో మారుస్తున్నారు. కారణం ఏంటంటే.. హిందీలో అమితాబ్ బచ్చన్ కూలీ అనే సినిమా చేశారు. అది క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే అమితాబ్ కు కడుపులో గాయం అవ్వడం.. ఆయన కోరుకోవాలని దేశ వ్యాప్తంగా అభిమానులు పూజలు చేయడం జరిగింది. హిందీలో వరుణ్ ధావన్ కూలీ నెంబర్ 1 అనే టైటిల్ తో సినిమా చేశారు. అయితే.. బాలీవుడ్ లో కూలీ టైటిల్ ఓ నిర్మాత దగ్గర ఉందట. ఆ టైటిల్ ను సన్ పిక్చర్స్ అడిగినా ఇవ్వలేదట. రజినీకాంత్ సినిమాకి టైటిల్ పెట్టాలి అనుకుంటున్నట్గుగా చెప్పిన నో చెప్పారట. Coolie Title Changed in Hindi.

దీంతో చేసేదేమీ లేక ఒక్క హిందీలో కూలీ సినిమాని మజదూర్ అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఇది రజినీ అభిమానులకే కాదు.. కూలీ మేకర్స్ కూడా షాకే అని చెప్పచ్చు. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా నటించడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. అంతే కాకుండా కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, శృతి హాసన్, సత్యరాజ్.. ఇలా పెద్ద స్టార్ కాస్టే ఉంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని నిర్మించింది. ఖచ్చితంగా ఈ సినిమా భారీగా లాభాలు తీసుకువస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. కూలీ పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/bhagyasree-replaces-sreeleela-in-akhils-lenin-how-fans-will-react-on-this/