
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత బిజీగా ఉండడం వలన సినిమాలు పూర్తి చేయడం ఆలస్యం అయ్యింది. ఇప్పుడు వరుసగా తను పూర్తి చేయాల్సిన సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. అయితే.. వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల తర్వాత కొత్త సినిమాలు చేయరని.. సినిమాకు గుడ్ బై చెప్పేస్తారని ప్రచారం జరిగింది. ఆమధ్య తనకు డబ్బులు అవసరం ఉందని.. డబ్బులు కోసం సినిమాలు చేస్తాను అన్నారు. పవన్ అలా చెప్పినప్పటికీ.. పొలిటికల్ గా బిజీగా ఉండడం వలన కుదరకపోవచ్చు అంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే.. పవన్ ఇప్పుడు ఇద్దరు దర్శకులతో సినిమాలు చేయడానికి ఓకే చెప్పారని టాక్. ఇంతకీ.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు..? ఇప్పుడున్న బిజీలో పవన్ సినిమా చేయడం సాధ్యమేనా..?
వీరమల్లు, ఓజీ షూటింగ్ పూర్తి చేసి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో జాయిన్ అయ్యారు పవర్ స్టార్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారని ఓ వైపు ప్రచారం జరుగుతుంటే.. ఇద్దరు దర్శకులతో సినిమాలకు సంబంధించి ప్లానింగ్ జరుగుతుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆ ఇద్దరు దర్శకుల్లో ఒకరు స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబోలో మూవీని ఎప్పుడో ప్రకటించారు. అంతే కాకుండా.. ఈ క్రేజీ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం కూడా జరిగింది. ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందించారు. త్వరలో సెట్స్ పైకి వస్తుంది అనుకుంటే.. ఇంత వరకు ఈ మూవీ స్టార్ట్ కాలేదు.
ఇటీవల పవన్ కళ్యాణ్ ను డైరెక్టర్ సురేందర్ రెడ్డి కలిసారట. ఫుల్ స్క్రిప్ట్ రెడీగా ఉందని చెప్పారట. ఈ మూవీకి రామ్ తాళ్లూరి నిర్మాత. ఇప్పుడు అంతా సిద్దమని ఈ మూవీ టీమ్ చెప్పడంతో త్వరలో డేట్స్ ఇస్తానని మాట ఇచ్చారట. ఈ వార్త లీక్ అవ్వడంతో ఈ సినిమా ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఇక పవన్ సినిమా చేయడానికి ఓకే చెప్పిన రెండో డైరెక్టర్ ఎవరంటే.. సముద్రఖని పేరు వినిపిస్తోంది. సముద్రఖని.. మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి దర్శకుడు కూడా. పవన్, సముద్రఖని కలసి బ్రో సినిమా చేశారు. చాలా స్పీడుగా ఆ సినిమాను కంప్లీట్ చేసిన సముద్రఖిని టాలెంట్ చూసి మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారట.
ఇప్పుడు పవన్ కోసం సముద్రఖని ఓ కథ రెడీ చేయడంతో సినిమా చేద్దామన్నారని తెలిసింది. అయితే.. ఈ సినిమాకి నిర్మాత ఎవరు అనేది తెలియాల్సివుంది. ఈ రెండు సినిమాలే అంటే.. మరో సినిమా కూడా పూర్తి చేయాల్సివుంది. అదే.. వీరమల్లు పార్ట్ 2. దీనికి సంబంధించి కొంత పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ.. ఇంకా పవన్ పై పార్ట్ 2 కు సంబంధించి చిత్రీకరించాల్సిన సీన్స్ ఉన్నాయట. మొత్తానికి పవన్ మూడు సినిమాలు కంప్లీట్ చేస్తే.. మరో మూడు సినిమాలు డేట్స్ కోసం వెయిటింగ్ లో ఉంటాయి. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా సురేందర్ రెడ్డి, సముద్రఖని.. లతో సినిమాలు గురించి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.