ఔనా… స్పిరిట్ నుంచి దీపికను గెటవుట్ అన్నాడా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈ క్రేజీ కాంబోలో స్పిరిట్ అనే సినిమాని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఎప్పుడో ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి రావాలి కానీ.. ఇంత వరకు రాలేదు. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీలో కథానాయికగా దీపికా పడుకునేను తీసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి దీపికను సందీప్ తప్పించాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. దీపికను సందీప్ తప్పించడానికి కారణం ఏంటి..?

సందీప్ రెడ్డి వంగ.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే డైరెక్టర్. ప్రభాస్ తనతో సినిమా చేయడానికి ఓకే చెప్పినా.. తన రూల్స్ మార్చుకోడు. తన కండీషన్స్ ప్రకారమే సినిమా చేయాలి అంటాడు. ప్రభాస్ కు సైతం కండీషన్స్ పెడతాడు. అలాంటిది హీరోయిన్ కండీషన్ పెడితే.. ఓరుకుంటాడా..? ఇప్పుడు అదే జరిగిందని టాక్ వినిపిస్తోంది. మేటర్ ఏంటంటే.. ప్రభాస్ కు జంటగా దీపిక అయితే బాగుంటుందని ఆమెను కాంటాక్ట్ చేయడం.. ఫైనల్ చేయడం జరిగిందట. అయితే.. షూటింగ్ టైమింగ్స్‌, పారితోషికం, లాభాల్లో వాటా.. అంటూ దీపిక రోజుకో డిమాండ్ ముందు పెడుతోంద‌ట‌.

కాల్షీట్ అంటే సాధార‌ణంగా 8 గంట‌లు ఉంటుంది కానీ.. దీపిక మాత్రం ఆరు గంట‌ల్లోనే షూటింగ్ ముగించాల‌ని, అద‌నంగా ప‌ని చేయాలంటే మ‌రింతగా రెమ్యూనరేషన్ ఇవ్వాలని ఫరతులు పెడుతుందట. అంతే కాకుండా లాభాల్లో వాటా కావాలని అడగడం.. తన టీమ్ సాలరీలు కూడా నిర్మాతే భరించాలనడం సందీప్ రెడ్డికి నచ్చలేదట. ఆమె పెట్టే కండీషన్స్ నచ్చకనే ఆమె స్థానంలో మరో హీరోయిన్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. దీపికను తప్పించనున్నారని తెలిసినప్పటి నుంచి మృణాల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ప్రభాస్, మృణాల్ జంట చూడడానికి బాగుంటుంది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా దీపిక ప్లేస్ లో.. మృణాల్ వస్తుందేమో చూడాలి.