నాగార్జున ఛాన్స్ ఇస్తే పవన్ వైపే మొగ్గిన టాప్ హీరో…?

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎంతో మందికి అవకాశాలు ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే.. న్యూటాలెంట్ ను ఎంకరేజ్ చేయాలంటే.. నాగార్జున తర్వాతే ఎవరైనా. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు ఇలా ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు నాగార్జున తనతో సినిమా చేయమని ఒక హీరోకి ఛాన్స్ ఇస్తే.. ఆ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్‌ తో సినిమా చేయాలి అనుకుంటున్నాను అని చెప్పడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. పవన్ తో సినిమా చేస్తానంటున్న ఆ హీరో ఎవరు..? అసలు ఇది సాధ్యమేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తో సినిమా చేస్తాను అంటున్న హీరో ఎవరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జునతో ధనుష్ కలిసి కుబేర అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. తన రూటు మార్చి శేఖర్ కమ్ముల ఈ సినిమాని తీసారు. సమాజంలోని ధనిక, పేద వర్గాలకు మధ్య ఉన్న డిఫరెన్స్.. మనీ, పవర్ చుట్టూ కుబేర సినిమా సాగుతుందని ట్రైలర్ ను బట్టి క్లియర్ గా అర్థమవుతోంది. దీంతో ఈ సినిమా పై మరింత క్యూరియాసిటి పెరిగింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగినప్పుడు నాగార్జున మాట్లాడుతూ.. ధనుష్‌ డైరెక్షన్ లో సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నాను అన్నారు. ఈ విధంగా ధనుష్ కి నాగ్ ఆఫర్ ఇచ్చారు. అయితే.. హైదరాబాద్లో జరిగిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్‌ ను.. తెలుగులో డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే.. ఏ హీరోతో చేస్తారు అని అడిగితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ గార్ని డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నాను అని తెలియచేశారు. దీనిని బట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే.. ధనుష్‌ కు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పారు.

ధనుష్ తన మనసులో మాట బయటపెట్టాడు సరే.. మరి.. ఇది సాధ్యమేనా అంటే.. ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ హరి హర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసి.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా కంప్లీట్ అవ్వాలంటే.. పవన్ కళ్యాణ్‌ ఎంత లేదన్నా రెండు, మూడు నెలలు డేట్స్ ఇవ్వాల్సిందే. ఆతర్వాత తన ఫోకస్ అంతా పాలిటిక్స్ పైనే ఉంటుంది. అయితే.. పవన్ మరో రెండు సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడని.. అవి సురేందర్ రెడ్డితో ఓ సినిమా, సముద్రఖనితో ఓ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక నిజమైతే.. ఈ సినిమాలు కంప్లీట్ కావడానికి టైమ్ పట్టచ్చు. అందుచేత పవన్ తో ధనుష్ సినిమా చేయాలనుకున్నా.. పవన్ ఓకే చెప్పినా.. జరగాలంటే.. చాన్నాళ్లు ఆగాల్సిందే. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.