గేమ్ చేంజర్ రిజల్ట్ పై పెదవి విప్పిన దిల్ రాజు.!

Dil Raju opens up about Game Changer Result: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఒకప్పుడు వరుసగా భారీ క్రేజీ సినిమాలు చేయడం.. వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం.. చేసేవారు. అయితే.. ఇప్పుడు దిల్ రాజు జడ్జిమెంట్ తప్పింది. అందుకనే.. ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాప్స్ చూశారు. అయితే.. వెంకీతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే గేమ్ ఛేంజర్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. గేమ్ ఛేంజర్ గురించి ఇప్పటి వరకు మాట్లాడని దిల్ రాజు ఇప్పుడు మాత్రం ఓపెన్ అయ్యారు. అసలు ఏం జరిగిందో బయటపెట్టారు. ఇంతకీ.. దిల్ రాజు ఏం చెప్పారు..? ఆయన నిర్మించే క్రేజీ మూవీలో స్టార్ ఎవరు..?

ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్‌ నటించిన సినిమా గేమ్ ఛేంజర్. గ్రేట్ డైరెక్టర్ శంకర్ తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ కావడంతో ఖచ్చితంగా చరణ్‌ కు మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది అనుకున్నారు. అయితే.. గేమ్ ఛేంజర్ మూవీ అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బోల్తాపడింది. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు రన్ టైమ్ గురించి.. షూటింగ్ గురించి చాలా ప్రచారం జరిగింది. ఇప్పుడు వాటన్నింటి గురించి మాట్లాడారు దిల్ రాజు. ఏం చెప్పారంటే.. పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేసేటప్పుడు వంద శాతం సమస్యలు వస్తాయి. ఇది నాకే కాదు, దాదాపు అందరికీ జరుగుతుంది. ఎడిటర్ చెప్పినట్టుగా ఈ మూవీ నాలుగున్నర గంటలు నిడివి వచ్చిందన్నారు.

ఇంత వరకు అంత పెద్ద డైరెక్టర్ తో వర్క్ చేయలేదు. అందుకనే.. ఇలా జరిగింది. ఇది పూర్తిగా నా తప్పే అని ఒప్పుకున్నారు నిర్మాత దిల్ రాజు. తన కెరరీ లోనే బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పారు. చరణ్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయానని రిగ్రేట్ ఫీలవుతుంటాను. ఖచ్చితంగా చరణ్‌ కు బిగ్ హిట్ ఇస్తాను అన్నారు. అయితే.. ఇప్పుడు కాదు.. ఆ సినిమా చేయడానికి టైమ్ పడుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే.. భారీ పాన్ ఇండియా మూవీ కూడా ప్లాన్ చేస్తున్నానని.. చెప్పారు. అంతే కాకుండా అందులో పాన్ ఇండియా స్టార్ నటిస్తాడని చెప్పారు. ఈ క్రేజీ మూవీలో స్టార్ ఎవరు అనేది మాత్రం బయటపెట్టలేదు. Dil Raju opens up about Game Changer Result.

ఎవరా ఆ పాన్ ఇండియా స్టార్ అని అడిగితే.. అల్లు అర్జున్ కావచ్చు.. మహేష్‌ బాబు కావచ్చు.. ప్రభాస్ కావచ్చు.. ఎన్టీఆర్ కావచ్చు అని చెప్పారు కానీ.. ఎవరు అనేది మాత్రం లీక్ చేయలేదు. దీంతో దిల్ రాజు నిర్మించే భారీ క్రేజీ పాన్ ఇండియా మూవీలో నటించే స్టార్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం దిల్ రాజు ఫోకస్ అంతా తమ్ముడు సినిమా పై ఉంది. నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మించిన తమ్ముడు సినిమా జులై 4న విడుదల కానుంది. ఈ సంవత్సరంలో దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చే సినిమా ఇదొక్కటే. మరి.. తమ్ముడు మూవీ నితిన్ అండ్ దిల్ రాజుకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/an-exciting-update-from-vishwambhara-the-megastar-has-given-the-green-signal-for-it/